ప్రతిపక్షానికి ఓటు వేస్తే గుండు సున్నే.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షానికి ఓటు వేస్తే గుండు సున్నే..

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

ప్రతిపక్షానికి ఓటు వేస్తే గుండు సున్నే..

ప్రతిపక్షానికి ఓటు వేస్తే గుండు సున్నే..

నేడు ఏదులాపురంలో ప్రచారం

సత్తుపల్లి రోడ్డు షోలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సత్తుపల్లి: ‘ఓటర్ల వద్దకు కొందరు రంగురంగుల కండువాలు వేసుకుని వస్తున్నారు.. మీరు ఎమ్మెల్యేనా, ఎంపీనా, మంత్రినా.. ఏ హోదాతో హామీలు ఇస్తున్నారు.. అవి ఎలా నెరవేరుస్తారు’ అని వారిని నిలదీయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇంకా అధికారంలో ఉన్నట్లు భ్రమ పడుతున్న ప్రతిపక్షానికి ఓటు వేస్తే మిగిలేది గుండు సున్నానే అని పేర్కొన్నారు. సత్తుపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున గురువారం ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌, టీజీ ఐడీసీ చైర్మన్‌ మువ్వా విజయబాబుతో కలిసి రోడ్‌షో నిర్వహించగా మంత్రి మాట్లాడారు. ఏ అభివృద్ధి జరగాలన్నా, నిధులు రావాలన్నా ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని సత్తుపల్లి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

వైఎస్సార్‌ ఇచ్చిన ఇళ్ల స్థలాలే..

సత్తుపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన రాజీవ్‌నగర్‌ ఇళ్ల స్థలాలే తప్ప బీఆర్‌ఎస్‌ పాలనలో ఎవరికీ స్థలం ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో ఇళ్ల స్థలాల సమస్యను ఎమ్మెల్యే రాగమయి పలుమార్లు చర్చించడంతో ఎన్టీఆర్‌ కాలువ ను పూడ్చివేయించి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా హామీ వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ పరిపాలనలో మాటలు తప్ప పనులు జరగలేదన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక పేదలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 15 ఏళ్ల పాలనలో సత్తుపల్లిలో రోడ్డుకో శిలాఫలకం వేయడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. అభివృద్ధి అంటే రోడ్లు వేయడమే కాద ని.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించి అవసరాల ను తీర్చడమని తెలిపారు. టీజీఐడీసీ చైర్మన్‌ మువ్వా విజయబాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్ని కల తరహాలోనే మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో విజయం సాధించాలన్నారు. డాక్టర్‌ దయానంద్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీల ప్రతీ పని పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రచా రంలో అభ్యర్థులు, నాయకులు ఎం.డీ.కమల్‌పాషా, తోట సుజలరాణి, ఎస్‌.కే.మౌలాలీ, మందపాటి ప్రభాకర్‌రెడ్డి, ఎం.డీ.రెహానాబేగం, బొంతు సుమలత, వందనపు సత్యనారాయణ, నాయుడు రాధిక, ఎస్‌.కే.నాగుల్‌మీరా, బండారు శరత్‌, మట్టా దేవజ్యోతి, పింగళి సామేలు పాల్గొన్నారు.

ఖమ్మంరూరల్‌: ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో శుక్రవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్డుషో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3–30 నుండి 1, 21, 19, 18, 31, 32, 17వ వార్డుల్లో రోడ్డు షో ఉంటుందని, అభ్యర్థులు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరు దయాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement