ఏదులాపురంలో రూ.308 కోట్లతో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఏదులాపురంలో రూ.308 కోట్లతో అభివృద్ధి

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

ఏదులాపురంలో                రూ.308 కోట్లతో అభివృద్ధి

ఏదులాపురంలో రూ.308 కోట్లతో అభివృద్ధి

ఏదులాపురంలో రూ.308 కోట్లతో అభివృద్ధి

ఏదులాపురం మున్సిపల్‌ పరిధిలో రూ.308 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్డు అభివృద్ధి పనులు, పోస్ట్‌ మెట్రిక్‌ బాలుర, బాలికల హాస్టల్‌ భవనాల నిర్మాణం చేపడుతున్నాం. ఏదులాపురం, గొల్లగూడెం, గుదిమళ్ల, గుర్రాలపాడు, మద్దులపల్లి, ముత్తగూడెం, పెద్దతండా, పోలేపల్లి, పల్లెగూడెం, తెల్దారుపల్లి, వెంకటగిరి తదితర గ్రామాల్లో ఉపాధి హామీ, పట్టణాభివృద్ధి నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాం. రూ.23.50 లక్షలతో ఓఅండ్‌ఎం పథకం ద్వారా తెల్దారుపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ నుంచి చెరువులు, కుంటలు, కాల్వల కు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్నాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశాం. వెంకటగిరిలో రూ.2.65 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. రూ.2కోట్లతో గిరిజన భవనం నిర్మిస్తున్నాం. ఇంకొన్ని శాశ్వత అభివృద్ధి పనులతో ఏదులాపురంను రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement