వృత్తి నైపుణ్యాలతో స్వయంఉపాధి
భద్రాచలం: నిరుద్యోగ గిరిజన యువత వృత్తి నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని స్వయం ఉపాధి పెంపొందించుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అఽధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో గెస్ట్ సర్వీస్ అసోసియేట్, ఎలక్ట్రానిక్ ప్యూరిఫైర్, డ్రోన్ సర్వీస్ ఎలక్ట్రీషియన్లలో శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులు పీఓను ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ వైటీసీలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపాధిలో ఉపయోగించి రాణించాలని సూచించారు.
ఏకలవ్య దరఖాస్తులకు ప్రత్యేక సెల్
తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల దరఖాస్తులను స్వీకరించేందుకు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు పీఓ తెలిపారు. గురువారం ప్రవేశ పరీక్షకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేసి మాట్లాడారు. ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో రూ. 100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా ఎంట్రన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్ రాజ్, హరికృష్ణ, శ్రీనివాస్, అరుణ, సులోచన, అబ్దుల్, భవాని, అనూహ్య, వినీత, సమ్మయ్య పాల్గొన్నారు.
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్


