గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం
కారేపల్లి: గిరిజన విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తూ వారిని తీర్చిదిద్దడమే లక్ష్యమని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ వెల్లడించారు. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి, రేలకాయలపల్లిలో బాలుర ఆశ్రమ పాఠశాలలను బుధవారం పీఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి బోధన, పరీక్షలకు సన్నద్ధత, మెనూ అమలుపై ఆరా తీశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి పీఓ మధ్యాహ్న భోజనం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, ఏసీఎంఓ రాములు, డీఈ రాజు, ఏఈ మహేందర్, ఏటీడీఓ రమేష్, ఎస్‌సీఆర్‌పీ బాల పాల్గొన్నారు.
యాప్‌పై అవగాహన కల్పించండి
ఖమ్మంరూరల్: యాప్ ద్వారా ఎరువుల బుకింగ్‌పై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని మద్దులపల్లి, ముత్తగూడెంలో ఎరువుల దుకాణాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు యాప్ ద్వారా బుకింగ్, యూరియా విక్రయాలను పరిశీలించాక మాట్లాడారు. షాప్‌లకు వచ్చే రైతులకు యాప్‌తో ఉపయోగాలను వివరించాలని తెలిపారు. అలాగే, పారదర్శకంగా ఎరువుల విక్రయాలు కొనసాగించాలని, రికార్డులు నిర్వహణ సరిగా చేపట్టాలని సూచించారు. ఏఓ ఉమానగేష్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ దిశగా తెలంగాణ..
ఖమ్మంమయూరిసెంటర్: ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎంజీడీఐఎస్ హెచ్‌ఏ) కింద తెలంగాణలో కొనసాగుతున్న డిజిటల్ శిక్షణపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పార్లమెంట్‌లో బుధవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖల సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో డిజిటల్ అక్షరాస్యత గణనీయంగా పెరిగిందని, రాష్ట్రంలో నమోదైన 14,56,226 మందిలో 12,10,448 మంది విజయవంతంగా శిక్షణ పూర్తయిందని బదులిచ్చారు. ఇందులో 7,63,651 మంది పురుషులు, 4,46,777 మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్‌పై అవగాహన, ఆన్‌లైన్ సేవల వినియోగం పెరగగా, డిజిటల్ లావాదేవీలు, ప్రభుత్వ ఈ–సేవలను స్వయంగా వినియోగించుకునే స్థాయికి లబ్ధిదారులు చేరుకున్నారని తెలిపారు.
మహా మండపం నిర్మాణానికి రూ.21 లక్షల విరాళం
కామేపల్లి: కామేపల్లిలో రూ.5కోట్ల వ్యయంతో పునర్మించనున్న శ్రీ హరిహర గురు క్షేత్రం(శివాలయం)లో భాగంగా మహా మండపానికి ఖమ్మం వాసి కాసాని నాగలక్ష్మి–శేషారావు దంపతులు రూ.21,11,116 విరాళం ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి విడత రూ.10 లక్షలను బుధవారం ఆలయ కమిటీ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాలయం నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం దాతను నిర్వాహకులు సన్మానించారు. నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గొట్టుపర్తి శివాజీతో పాటు కేసగాని నాగయ్య, అజ్మీరా హరినాయక్, రాందాస్‌నాయక్, భూక్యా శ్రీనివాస్, బండి శ్రీనివాస్, దమ్మలపాటి శివాజీ పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం
గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం
గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం


