జత కట్టారు! | - | Sakshi
Sakshi News home page

జత కట్టారు!

Feb 4 2026 7:09 AM | Updated on Feb 4 2026 7:09 AM

జత కట్టారు!

జత కట్టారు!

కాంగ్రెస్‌ కొన్నింట సింగిల్‌.. మరికొన్నింట్లో పొత్తు అన్నిచోట్లా పొత్తు లేకుండా బీజేపీ పోటీ ‘గూడెం’లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే.. మిగతా చోట్ల సీపీఎంతో కూటమి

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌, ఏడు మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల పొత్తులు తేలాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు ఎవరితో ఎవరు జత కట్టారో కూడా స్పష్టత వచ్చింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ సీపీఎంతో కలవగా.. సీపీఐ – టీడీపీ జత కట్టాయి. ఇతర మున్సిపాలిటీల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్‌ కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకున్నా, మరికొన్నింట్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. బీఆర్‌ఎస్‌ – సీపీఎం సైతం పొత్తుతో ముందుకెళ్తున్నాయి. ఇక అన్నిచోట్లా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండడం గమనార్హం.

ఎవరు..ఎవరితో..

నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియగా.. ఆయా పార్టీల అభ్యర్థులకు పార్టీల గుర్తులు, స్వతంత్రులకు ఇతర గుర్తులు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే కొత్తగూడెంలో ఆసక్తికర పొత్తులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌, సీపీఎంతో జత కట్టగా, సీపీఐ – టీడీపీ కలిసి పోటీకి దిగాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఒంటరిపోరుకు దిగగా, సీపీఐ, సీపీఎం, మాస్‌లైన్‌తో బీఆర్‌ఎస్‌ కూటమిగా ఏర్పడింది. అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ – సీపీఎం పొత్తుతో, బీఆర్‌ఎస్‌, సీపీఐ సింగిల్‌గా బరిలో ఉన్నాయి. ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తోంది. బీఆర్‌ఎస్‌ – సీపీఎం పొత్తు కుదిరింది. ఇక్కడ సీపీఐ సింగిల్‌గా పోటీలో ఉంది. మధిరలో కాంగ్రెస్‌ – టీడీపీ పొత్తు కుదరగా బీఆర్‌ఎస్‌ సీపీఐ, సీపీఎంతో జత కట్టింది. సత్తుపల్లి, కల్లూరు, వైరా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, సీపీఐ ఒంటరిగానే బరిలో నిలవగా బీఆర్‌ఎస్‌, సీపీఎం పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐతో పొత్తు పెట్టుకున్నా.. ఈ అభ్యర్థులకు సీపీఐ బీ ఫామ్‌లే ఇవ్వడంతో కంకి కొడవలి గుర్తు వచ్చింది. ఇక మధిరలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుని మూడు వార్డుల్లో బరిలో దిగినప్పటికీ ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా పరిగణించి గుర్తులు కేటాయించారు.

ఏదులాపురం

మున్సిపాలిటీ :

వార్డులు 32

కాంగ్రెస్‌ ఒంటరి పోరు

పోటీ : 32 వార్డులు (15వ వార్డు తమ్మినేని మంగతాయి ఏకగ్రీవం)

పొత్తు : బీఆర్‌ఎస్‌, సీపీఎం

పోటీ : బీఆర్‌ఎస్‌ – 23, సీపీఎం – 08 వార్డులు

సీపీఐ ఒంటరి పోరు : పోటీ 11 వార్డులు

బీజేపీ ఒంటరిపోరు : పోటీ 24 వార్డులు

అశ్వారావుపేట

మున్సిపాలిటీ :

వార్డులు 22

పొత్తు : కాంగ్రెస్‌, సీపీఎం

పోటీ : కాంగ్రెస్‌ 21, సీపీఎం 01 వార్డు

బీఆర్‌ఎస్‌ ఒంటరి పోరు : పోటీ 22 వార్డులు

సీపీఐ ఒంటరి పోరు : పోటీ 01 వార్డు

బీజేపీ ఒంటరి పోరు : పోటీ 15 వార్డులు

కొత్తగూడెం

కార్పొరేషన్‌ :

డివిజన్లు 60

పొత్తు : కాంగ్రెస్‌, సీపీఎం

పోటీ : కాంగ్రెస్‌ 58, సీపీఎం 02

బీఆర్‌ఎస్‌ ఒంటరి పోరు : పోటీ 59 డివిజన్లు

పొత్తు : సీపీఐ, టీడీపీ పొత్తు

పోటీ : సీపీఐ 56 డివిజన్లు, టీడీపీ 04 డివిజన్లు

బీజేపీ ఒంటరిపోరు : పోటీ 56 డివిజన్లు

కలిసి వచ్చిన వారితో కలివిడిగా..

ఇల్లెందు మున్సిపాలిటీ :

వార్డులు 24

కాంగ్రెస్‌ ఒంటరి పోరు : పోటీ 24 వార్డులు

పొత్తు : బీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ, మాస్‌లైన్‌

పోటీ : బీఆర్‌ఎస్‌ – 20, సీపీఎం – 01, సీపీఐ – 02, మాస్‌లైన్‌ – 01

బీజేపీ ఒంటరి పోరు : పోటీ 18 వార్డులు

ఎన్‌డీ ఒంటరిపోరు : పోటీ 01 వార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement