వాలీబాల్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్‌జూనియర్ బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లావ్యాప్తంగా బాలబాలికలు 130 మందికి పైగా హాజరుకాగా, ప్రతిభ కలిగిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి బి.గోవిందారెడ్డి తెలిపారు. వీరు కామారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. బాలుర జట్టులో కె.వెంకన్నబాబు, వి.వినయ్‌వర్మ, పి.రేవంత్, జె. చరణ్‌కుమార్, జి. వినయ్‌కుమార్, కె.నాగచైతన్య, కె.రాకేష్ వర్థన్, వై. రిషి వర్మ, ఎం.రాం చరణ్, బి.లోకేష్, పి.కార్తీక్, ఎస్. అర్షద్, టి.శ్రీకాంత్, ఎం, జశ్వంత్, బాలికల జట్టులో జి.హర్షిణి, ఎస్.నందమ్మ, కె. అమృత, ఎస్.పరియామ్మ, పి.నిధి, ఎస్‌డీ అర్షీయా, బి.శాంతిశ్రీ, ఎస్.విజ్ఞాత, బి. జయకేశి, బి.జస్మిత, జి.ఉషారాణి, కె. రాధీక, ఎస్. శ్రీలక్ష్మి ఉన్నారు.
ఫెర్టిలైజర్ డీలర్ల
అసోసియేషన్‌లో స్థానం
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గంలో జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. అసోసియేషన్ కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు ఉపాధ్యక్షులుగా జిల్లాకు చెందిన పునుకొల్లు రాంబ్రహ్మం, సహాయ కార్యదర్శిగా రామడుగు మనోహర్, గౌరవ అధ్యక్షుడిగా బోడేపూడి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.
విద్యార్థులకు అండగా నిలవండి
● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర: వాసవీ క్లబ్ సభ్యులు తమ కుటుంబం, వ్యాపారాలు చూసుకుంటూనే సమాజ సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలుస్తుంటారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. వాసవీ వనితా క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం రాత్రి జరగగా భట్టి మాట్లాడారు. సేవా కార్యక్రమాలు చేపడుతూనే నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడంతో పాటు గృహిణులు ఆర్థికాభివృద్ధి సాధించేలా వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర కార్యక్రమాలతో విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చింతకాని: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను చింతకాని గ్రామంలో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. చిన్నమండవ వద్ద మున్నేరు నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తుండగా రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
మత్స్యకారుడు మృతి
కొణిజర్ల: మండలంలోని పల్లిపాడు సమీపాన రోడ్డు ప్రమాదంలో మత్స్యకారుడు మృతి చెందాడు. మండలంలోని లాలాపురం శివారుకు చెందిన షేక్ యాకూబ్ మియా(33) ద్విచక్రవాహనంపై వైరా వెళ్లి తిరిగి వస్తుండగా పల్లిపాడు సమీపాన గుబ్బగుర్తి వైపు నుంచి వ్యక్తి బైక్‌ను రోడ్డు పైనే నిలపడంతో ఢీకొన్నాడు. దీంతో యాకూబ్‌మియా రోడ్డుపై పడడంతో తలకు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూరజ్ తెలిపారు.
పోలీసుల అదుపులో మోటార్ల దొంగలు
తిరుమలాయపాలెం: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ మోటార్లు చోరీ చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల మహ్మాదాపురం, తిరుమలాయపాలెం, ఏలువారిగూడెం, బీరోలులో ఒక్కో మోటార్, జల్లెపల్లిలో రెండు మోటార్లను చోరీ చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలోనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని మోటార్లను రికవరీ చేసి రైతులకు అప్పగించారు. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
వాలీబాల్ జట్ల ఎంపిక
వాలీబాల్ జట్ల ఎంపిక


