‘డబుల్’ ధమాకా
●ఇసీ్త్ర చేస్తూ.. సమోసా వేస్తూ..
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కొత్తగూడెంలోని 56వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బాలిశెట్టి సత్యభామ శుక్రవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇసీ్త్ర చేస్తూ, టైలరింగ్ పనులు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. 55వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హరిహరన్ సమోసాలు కాల్చుతూ అక్కడి వారిని ఓటు అభ్యర్థించారు. సత్తుపల్లి మున్సిపాలిటీ 23వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్‌కే సాహెరాబేగం కూడా ప్రచారంలో భాగంగా ఇసీ్త్ర చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. కాగా, ఆమె ప్రత్యర్థి అపర్ణ రజక కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, వారికి ఇసీ్త్ర దుకాణం ఉండడం గమనార్హం. – కొత్తగూడెంఅర్బన్/సత్తుపల్లిరూరల్
ఒకే కుటుంబం నుంచి బరిలో ఇద్దరు..
సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోరు ఆసక్తికరంగా మారింది. పలువురు ఒకే కుటుంబం నుంచి వేర్వేరు వార్డుల్లో బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో భార్యకు మద్దతు తెలిపేందుకు భర్త, కూతురుకు మద్దతుగా తండ్రి.. ఇలా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో భార్యాభర్తలు నిలవగా, బీజేపీ నుంచి తండ్రీకూతురు బరిలో నిలిచారు. కాగా, ఈ డబుల్ ధమాకా పోటీపై పట్టణంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
– సత్తుపల్లి
అభ్యర్థుల వినూత్న ప్రచారం..
‘డబుల్’ ధమాకా
‘డబుల్’ ధమాకా
‘డబుల్’ ధమాకా
‘డబుల్’ ధమాకా


