ఏఈఓల నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మంసహకారనగర్: టీఎన్జీవోస్ అనుబంధంగా తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీ ఏఈఓ)ల జిల్లా నూతన కార్యవర్గం శనివారం ఏకగ్రీమైంది. టీఎన్జీవోస్ ఫంక్షన్‌హాల్లో జరిగిన ఎన్నికలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దినేని రాధాకృష్ణమూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించి, ఫలితాలు ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎండీ జానీబాబా, కార్యదర్శిగా యు.శివకృష్ణ, అసోసియేట్ అధ్యక్షులుగా కె.శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వర్లు, ఎం.ఆదర్శ్, కోశాధికారిగా బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీలుగా దీపక్‌రెడ్డి, సాయికుమార్, కె.ప్రతిభ, కల్చరల్ సెక్రటరిగా కె.నరేశ్, స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరిగా గురుమూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శివకుమార్, సభ్యులుగా సైదులు, హరికృష్ణ, నాగసాయి, వాసంతి, అవినాష్ ఎన్నికయ్యారన్నారు. ఈ కమిటీ మూడు నెలల పాటు కొనసాగుతుంది. నూతన కమిటీని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు అభినందించారు. కార్యక్రమంలో జైపాల్, విజయ్‌కుమార్, దీలిప్ పాల్గొన్నారు.


