ఐ మార్క్ ఫొటోగ్రఫీలో అవార్డులు
ఖమ్మంగాంధీచౌక్/ఖమ్మంమామిళ్లగూడెం: ఐ మార్క్ ఫొటోగ్రఫీ విభాగంలో తెలుగురాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు ఫొటోగ్రాఫర్లు అవార్డులు గెలుచుకున్నారు. జిల్లాకు చెందిన ఫొటోగ్రఫీ నిపుణుడు జగన్ ఆధ్వర్యంలో ఏపీలోని అల్లూరి జిల్లా మోతుగూడెంలో గత నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఫొటోగ్రఫీ స్పాట్ కాంపిటీషన్ వర్క్‌షాప్ నిర్వహించి, శనివారం విజేతలకు అవార్డులు అందించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది ఫొటోగ్రాఫర్లు తలపడగా.. జిల్లా నుంచి ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రతినిధి మారగాని వెంకట్, కోశాధికారి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. నాలుగు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన 16 మంది ఫొటోగ్రాఫర్లు అవార్డులు గెలుచుకున్నారు. అందులో సతీశ్‌రెడ్డి తీసిన ఫొటోకు సైతం అవార్డు వచ్చింది. కార్యక్రమంలో బీకే అగర్వాల్, క్లిక్ అండ్ క్లిక్ శ్రీను పాల్గొన్నారు.
జాతీయ మహిళా క్రికెట్ విజేత ఉత్తరాఖండ్
ఖమ్మంస్పోర్ట్స్: వారం రోజులుగా ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన జాతీయస్థాయి ఇన్విటేషన్ టీ–20 మహిళా క్రికెట్ టోర్నీ శనివారం ముగిసింది. విజేతగా ఉత్తరాఖండ్ జట్టు నిలువగా రన్నరప్‌గా ఉత్తరప్రదేశ్ జట్టు నిలింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తరాఖండ్ జట్టు పరిమిత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు 18.1 ఓవర్లు ఆడి 90 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఎండీ ఫర్హా, డాక్టర్ ఎంజీవీ ప్రవీణ్‌కుమార్, కురువెల్ల ప్రవీణ్‌కుమార్, రాయల సతీశ్, సందీప్‌ఆర్య,ఎండీ మతిన్, జానీపాషా పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో సత్తా
ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ కేటగిరిల్లో జిల్లా క్రీడాకారులు ఏడుగురు పతకాలు సాధించగా ఇద్దరు క్రీడాకారులు ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు పుణెలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారుల్లో శ్రీఆద్య, యువాస్‌రెడ్డి, వినూత్న, దీక్షిత్‌రెడ్డి, భరత్, హమీద్, మోక్షచంద్రశేఖర్ ఉండగా.. జాతీయస్థాయి పోటీలకు మనోజ్ఞ, దీక్షిత ఎంపికయ్యారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్ భవ్య క్రీడాకారులను అభినందించారు.
ఐ మార్క్ ఫొటోగ్రఫీలో అవార్డులు
ఐ మార్క్ ఫొటోగ్రఫీలో అవార్డులు


