కాంగ్రెస్ విజయమే లక్ష్యం
పార్టీ శ్రేణుల ఐక్యమత్యంతో
సులువుగా గెలుపు
ఎన్నికల సన్నాహక సమావేశాల్లో
మంత్రి కొండా సురేఖ
ఖమ్మంమయూరిసెంటర్/సత్తుపల్లి/మధిర/వైరా: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి, మున్సిపల్ ఎన్నికల ఖమ్మం పార్లమెంటరీ ఇన్‌చార్జ్ కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపల్ నాయకులతో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఒకటి రెండు చోట్ల మినహా అన్ని వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలవడం మంచి పరిణామమని అన్నారు. పార్టీలో చీలికలు రాకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో అసమ్మతిదారుల నామినేషన్లు విత్ డ్రా చేయించడంలో నాయకులు విజయవంతం అయ్యారని అభినందించారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయనే అంశాన్ని గుర్తించాలని, ఇదే సమయాన ఓట్లు చీలితే పార్టీకి నష్టమని తెలిపారు. కాగా, ఏదులాపురం మున్సిపాలిటీలో రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాన్ని మంత్రి సురేఖ ఆవిష్కరించారు. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల సన్నాహక సమావేశంలో సత్తుపల్లిలో జరగగా మంత్రి సురేఖ మాట్లాడుతూ పొరపొచ్చాలకు పోకుండా పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేస్తూ రెండు మున్సిపాలిటీలను గెలుచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ రానున్న రెండేళ్లల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మధిర సమావేశంలో సురేఖ మాట్లాడుతూ మున్సిపాలిటీని గెలవడం ద్వారా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బహుమతి ఇవ్వాలని సూచించారు. వైరాలో మంత్రి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారు టికెట్ రాలేదని బాధపడకుండా అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈసమావేశాల్లో రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా, ఖమ్మం నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్ చౌదరి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, వైరా మార్కెట్ చైర్మన్ బోళ్ల గంగారావు, నాయకులు మద్దినేని బేబి స్వర్ణకుమారి, తుంబూరు దయాకర్‌రెడ్డి, గాదె చెన్నారావు, ఎండీ.కమల్‌పాషా, చల్లగుళ్ల నర్సింహారావు, వి.వెంకటేశ్వరరావు, పి.చందర్‌రావు, సాయి, సందీప్‌గౌడ్, సూరంశెట్టి కిషోర్, మిరియాల రమణగుప్తా, తూమాటి నవీన్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, సూతకాని జైపాల్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, శీలం వెంకటనర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.


