ఎక్కడైనా.. ఎక్స్‌రే! | - | Sakshi
Sakshi News home page

ఎక్కడైనా.. ఎక్స్‌రే!

Feb 3 2026 7:22 AM | Updated on Feb 3 2026 7:22 AM

ఎక్కడైనా.. ఎక్స్‌రే!

ఎక్కడైనా.. ఎక్స్‌రే!

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎక్స్‌రే అవసరమైతే పెద్ద తతంగమే. యంత్రాలు పెద్దగా ఉండడంతో

ఆస్పత్రులకు కానీ ల్యాబ్‌లకు వెళ్తేనే ఎక్స్‌రే తీయడం సాధ్యమయ్యేది. ఇక టీబీ క్యాంపుల్లో తెమడ పరీక్షల ద్వారా మాత్రమే బాధితులను గుర్తిస్తుండగా ఎక్స్‌ రే ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురయ్యేది. వీటన్నింటికి చెక్‌ పెట్టేలా కేంద్రప్రభుత్వం నుంచి టీబీ విభాగానికి హ్యాండ్‌ హోల్డ్‌ పోర్టబుల్‌ మొబైల్‌ ఎక్స్‌రే యంత్రాన్ని కేటాయించారు. ఈ మిషన్‌ రేడియషన్‌ తక్కువగా వెలువరించడంతో పాటు నాణ్యతతో కూడిన చిత్రాలు విడుదల చేస్తుంది.

ఎక్కడికై నా తీసుకెళ్లే వీలుండే కొత్త యంత్రాన్ని కలెక్టర్‌ అనుదీప్‌ కలెక్టరేట్‌లో సోమవారం పరిశీలించారు.

డీఎంహెచ్‌ఓ రామారావు, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ సుబ్బారావు, డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌, అధికారులు చందునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

– ఖమ్మం వైద్యవిభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement