ప్రారంభమైన ప్రాక్టికల్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ప్రాక్టికల్‌ పరీక్షలు

Feb 3 2026 7:22 AM | Updated on Feb 3 2026 7:22 AM

ప్రార

ప్రారంభమైన ప్రాక్టికల్‌ పరీక్షలు

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవా రం నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం సెషన్‌లో రెగ్యులర్‌, ఒకేషనల్‌ అభ్యర్థులకు 49 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 3,031మంది విద్యార్థుల్లో 2,870 మంది హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. అలాగే, మధ్యాహ్నం సెషన్‌ 32 కేంద్రాల్లో జరగగా 2,603మంది విద్యార్థులకు గాను 2,536 మంది హాజరయ్యారని వెల్లడించారు. హెచ్‌పీసీ, డీఈసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో పాటు తాను 53 కేంద్రాల్లో తనిఖీ చేశామని డీఐఈఓ తెలిపారు.

పోస్టల్‌ ప్రాంచైజీలకు

దరఖాస్తుల స్వీకరణ

ఖమ్మంగాంధీచౌక్‌: ఇండియా పోస్టు ప్రాంచైజ్‌ స్కీం ద్వారా ప్రాంచైజీల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఖమ్మం పోస్టల్‌ సూపరిటెండెంట్‌ వి.వీరభద్రస్వామి తెలిపారు. 18 ఏళ్లు నిండి ఇంటర్‌ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. డెలివరీ మాత్రమే చేసే వారికి పదో తరగతి అర్హత ఉండాలని తెలిపారు. వీరు వాహనం, డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలని వెల్లడించారు. స్పీడ్‌ పోస్టు బుకింగ్‌, ఇండియా పోస్టు పార్సిల్‌, ఇంటర్నేషనల్‌ పార్సిల్‌ డెలివరీ, సీఓడీ కలెక్షన్ల సేవల కోసం ఆసక్తి ఉన్న వారు ఇండియా పోస్టు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం పోస్టాఫీసుల్లో సంప్రదించాలని సూపరింటెండెంట్‌ తెలిపారు.

ఔషధ మొక్కల

గుర్తింపుపై అవగాహన

సత్తుపల్లిరూరల్‌: జీవవైవిధ్యం, ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై సత్తుపల్లిలోని జేవీఆర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్‌ ఇన్నోవేషన్‌ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్‌ గొల్లమందల రవి పాల్గొని మొక్కల శాసీ్త్రయ గుర్తింపు, ఔషధ విలువలు, సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. ఆతర్వాత కళాశాలలోని బొటానికల్‌ గార్డెన్‌లో మొక్కలను ప్రత్యక్షంగా పరిచయం చేశారు. ప్రిన్సిపాల్‌ ఎస్‌కే. పీర్‌సాహెబ్‌, అధ్యాపకులు డాక్టర్‌ ఎస్‌.బాబు, ఎల్‌.మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభమైన  ప్రాక్టికల్‌ పరీక్షలు 
1
1/1

ప్రారంభమైన ప్రాక్టికల్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement