కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆశీర్వదించండి.. | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆశీర్వదించండి..

Feb 4 2026 7:09 AM | Updated on Feb 4 2026 7:09 AM

కాంగ్

కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆశీర్వదించండి..

ఖమ్మంరూరల్‌: ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఏదులాపురం మున్సిపల్‌ పరిధి 7, 8, 9, 12, 13 వార్డుల్లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, స్థలాలు ఇచ్చే శాఖ తన వద్దే ఉన్ననందున ఎన్నికల కోడ్‌ ముగియగానే అర్హులందరికీ ఇచ్చే బాధ్యత స్వీకరిస్తానని పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి విడతల వారీగా పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు విశ్రమించనని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వాన తమ ప్రభుత్వం ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, సన్న బియ్యం పంపిణీతో పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి వివరించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌ రోడ్లు, డ్రెయిన్‌ పనులను వేసవి లోపే పూర్తి చేస్తామని ప్రకటించిన మంత్రి,, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో అభ్యర్థులు, వార్డు ఇన్‌చార్జ్‌లతో పాటు నాయకులు వెంపటి రవి, భూక్యా సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

●మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఏదులాపురంలోని ఐదు వార్డుల్లో ప్రచారం చేయనున్నారు. ఈమేరకు 10, 11, 28, 29, 30వ వార్డుల్లో ఉదయం 8గంటల నుంచి మంత్రి రోడ్‌షో నిర్వహిస్తారని క్యాంప్‌ కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరు దయాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆశీర్వదించండి..1
1/1

కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆశీర్వదించండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement