ప్రవేశాల పెంపునకు కృషి
కొణిజర్ల: ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ విద్యాసంస్థల్లో ప్రవేశాల సంఖ్య పెరిగేలా ప్రిన్సిపాళ్లు, అడ్మిషన్ కమిటీల బాధ్యులు కృషి చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎండీ.ముజాహిద్ సూచించారు. కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్దులలో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంచేలా బోధన సాగాలని తెలిపారు. ఆతర్వాత విద్యార్ధులతో మాట్లాడి వసతి, భోజనం, మెనూపై ఆరా తీసిన ఆయన ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. ఉమ్మడి జిల్లా ఆర్‌ఎల్‌సీ ఎం.జే.అరుణకుమారి, విజిలెన్స్ ఆఫీసర్ సీతారాములు, అకడమిక్ కోఆర్డినేటర్ అఫ్రోజ్, జితేష్ తదితరులు పాల్గొన్నారు.


