అన్నదానానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

అన్నదానానికి రూ.లక్ష విరాళం

Feb 4 2026 7:10 AM | Updated on Feb 4 2026 7:10 AM

అన్నద

అన్నదానానికి రూ.లక్ష విరాళం

ఖమ్మంఅర్బన్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం కై కొండాయిగూడెం క్రాస్‌ వద్ద ఉన్న శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే అన్నదానానికి దేవభక్తుని కిషోర్‌బాబు రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని మంగళవారం ఆయన ఆలయ చైర్మన్‌, కార్పొరేటర్‌ నాగండ్ల కోటేశ్వరరావుకు అందజేశారు. ఈనెల 15న జరగనున్న మహాశివరాత్రి వేడుకల్లో అన్నదానానికి నగదు అందించిన దాతను అభినందించారు.

రావికంపాడు మైనర్‌ కాల్వకు గండి

కల్లూరు రూరల్‌: సాగర్‌ ప్రాజెక్టు పరిధి మండలంలోని రావికంపాడు మైనర్‌ కాల్వ డ్రాప్‌ వద్ద బుధవారం గండి పడింది. దీంతో సాగునీరు వృథాగా పోతుండగా, వరద ప్రవాహంతో కాల్వపై నిర్మించిన డ్రాప్‌ కూలే ప్రమాదముందని చెబుతున్నారు. మరోపక్క కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరు అందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్నెస్పీ అధికారుల వివరణ కోరగా డ్రాప్‌ వద్ద మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామని, ప్రస్తుతం నీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అన్నదానానికి రూ.లక్ష విరాళం
1
1/1

అన్నదానానికి రూ.లక్ష విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement