●ఎన్నికల విధులపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

●ఎన్నికల విధులపై అవగాహన

Feb 4 2026 7:10 AM | Updated on Feb 4 2026 7:10 AM

●ఎన్న

●ఎన్నికల విధులపై అవగాహన

వైరా: ఎన్నికల విధులకు కేటాయించిన ఉద్యోగులు నిబంధనలపై అవగాహన పెంచుకుని పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. వైరా తహసీల్‌లో మంగళవారం ఆయనమున్సిపాలిటీ అభ్యర్థుల బీ ఫాం లు, గుర్తులకేటాయింపును పరిశీలించి మాట్లాడారు. శాంతియుత వాతా వరణంలో పోలింగ్‌ జరిగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకునేలా అవగాహన కల్పించాలని, అక్రమంగా నగదు, మద్యం తరలించినట్లు తేలితే సీజ్‌ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ సురేష్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ గురులింగం, ఎంపీడీఓ తేజావత్‌ సక్రియా, ఎంఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

డీసీసీ మాజీ అధ్యక్షుడి సతీమణి విత్‌డ్రా

వైరా: వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ సతీమణి ఇందుమతి చైర్‌పర్సన్‌ బరిలో ఉన్నట్లు మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆమె 11వ వార్డు నుంచి నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. అయితే, మంగళవారం ఆమె నామినేషన్‌ ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా కొల్లి రమేష్‌కు బీ ఫాం దక్కింది. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా పదేళ్లకు పైగా పనిచేసిన దుర్గాప్రసాద్‌ తీసుకున్న నిర్ణయం వెనక ఆంతర్యం తేలాల్సి ఉంది.

కలెక్టర్‌

అనుదీప్‌ దురిశెట్టి

●ఎన్నికల విధులపై అవగాహన1
1/2

●ఎన్నికల విధులపై అవగాహన

●ఎన్నికల విధులపై అవగాహన2
2/2

●ఎన్నికల విధులపై అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement