మంత్రి పేరుతో వసూళ్లు? | - | Sakshi
Sakshi News home page

మంత్రి పేరుతో వసూళ్లు?

Feb 4 2026 7:10 AM | Updated on Feb 4 2026 7:10 AM

మంత్రి పేరుతో వసూళ్లు?

మంత్రి పేరుతో వసూళ్లు?

విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు

ఖమ్మంక్రైం: మంత్రితో తనకు ఉన్న పరిచయాల ఆధారంగా ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తామని చెబుతూ ఓ వ్యక్తి డబ్బు డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు సీపీ సునీల్‌దత్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయగా.. ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ బృందాలు కూడా రంగంలోకి దిగి సమాచారం సేకరిస్తున్నాయి. మంత్రి పేరిట వసూళ్లకు పాల్పడిన నిందితుడిని త్వరలోనే అరెస్ట్‌ చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

లాగితే ‘తీగ’ బయటపడింది..

రఘునాథపాలెం: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్‌ వైర్‌ చోరీపై రఘునాథపాలెం ఏఈ శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఖమ్మంటౌన్‌, సీసీఎస్‌, రఘునాథపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ముఠా పట్టుబడింది. ఈ మేరకు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్ట్‌చేసిన రఘునాథపాలెం పోలీసులువారి నుంచి 80కిలోల కాపర్‌ వైర్‌, 66కేజీల అల్యూమినియం వైర్‌ చుట్ట లు, ఆటోను స్వాధీనం చేసుకోగా, సీఐ ఉస్మాన్‌షరీఫ్‌ వివరాలు వెల్లడించారు.

సులువుగా సంపాదన కోసం...

ఖమ్మం కై కొండాయిగూడెంకు చెందిన పిట్టల గోపి, అంగోత్‌ ఉమాశంకర్‌, శీలం నాగేశ్వరరావు, మందా చత్రపతితో పాటు రమణగుట్టకు చెందిన బజ్జా కృష్ణ, వైఎస్సార్‌ కాలనీకి చెందిన ఓ మైనర్‌ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో ఆటో డ్రైవర్లు, వెల్డింగ్‌ పనులు చేసే వారితో పాటు పాత ఇనుము వ్యాపారి ఉన్నాడు. వీరు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్‌ వైర్‌ను తీసి విక్రయించడం ద్వారా డబ్బు సంపాదనకు అలవాటుపడ్డారు. జిల్లాలోని రఘునాథపాలెం, కామేపల్లి, ముది గొండ, ఖమ్మం రూరల్‌, కూసుమంచి, కొణిజర్ల, తల్లాడ, బోనకల్లు, తిరుమలా యపాలెం, ఖమ్మంఅర్బన్‌ స్టేషన్ల పరిధిలో చోరీలుచేయగా కాపర్‌ వైర్‌ను ఖానాపురంలోని పాత ఇనుము వ్యాపారి బజ్జా కృష్ణకు విక్రయించేవారు. ఈక్రమాన రఘునాథపాలెం ఏఈ శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. రఘునాథపాలెం ఎస్‌ఐ జి.నరేష్‌, సిబ్బంది ఎన్‌ఎస్‌.రాజు, బి.శ్రీనివాసులు, ఎండీ.అహ్మద్‌ఆలీ, వి.నవీన్‌ మంగళవారం ఆపిల్‌ సెంటర్‌ వద్ద వాహన తనిఖీ లు చేస్తున్న క్రమాన ఆటోలో వచ్చిన వారు అనుమానాస్పదంగా కనిపించారు. అందులో పరిశీలించడంతో అల్యూమినియం వైర్‌ కనిపించగా విచారించడంతో చోరీల విషయం బయటపడింది. నిందితులపై ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో 18 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఈమేరకు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్‌ వైర్‌ చోరీ ముఠా అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement