●బీ ఫామ్.. నీకా, నాకా ?!
వైరా: వైరా మున్సిపల్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చే సమయాన నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరికి బీ ఫామ్‌లు వస్తాయో తెలియక అందరూ వేచి చూశారు. చివరకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ ఒక్కొక్కరిని పిలిచి బీ ఫామ్‌లు ఇస్తుండగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకుని ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా, 12వ వార్డులో మిట్టపల్లి కృష్ణవేణి, ఎడ్లపల్లి వనజ ఇద్దరికి బీ ఫామ్‌లు ఇచ్చినా చివరకు కృష్ణవేణిని అధికారికంగా ప్రకటించారు. దీంతో వనజ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు.
●బరిలో దంపతులు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లోని రెండు డివిజన్ల నుంచి భార్యాభర్తలు పోటీలో ఉన్నారు. బూడిదగడ్డ ఏరియాకు చెందిన కనుకుంట్ల కుమార్, వెంకటరమణ 2005లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 3, 4వ వార్డుల నుంచి గెలిచా రు. ప్రస్తుతం కుమార్ 10వ డివిజన్, వెంకటరమణ 49వ డివిజన్ నుంచి పోటీకి దిగారు. ఇద్దరూ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడం ఆసక్తిగా మారింది.
2005 ఎన్నికల్లోనూ జంటగా విజయం
●బీ ఫామ్.. నీకా, నాకా ?!


