రెస్టారెంట్ వద్ద బైక్ చోరీ
సత్తుపల్లిరూరల్: బిర్యానీ తినాలని రెస్టారెంట్‌కు వెళ్లిన వ్యక్తి బయటకు వచ్చే సరికి ఆయన బైక్ చోరీకి గురైంది. సత్తుపల్లిలోని బాలాజీ థియేటర్ పక్కన ఉన్న రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి మంగళవారం బైక్‌పై వెళ్లాడు. లోనకు వెళ్లి బిర్యానీ తినొచ్చేసరికి బైకు లేకపోవడంతో ఖంగుతిన్నాడు. హోటల్‌లోని సీసీ కెమెరాలు పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి బైక్‌ను చోరీ చేసినట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దాడి ఘటనపై జీరోఎఫ్‌ఐఆర్
ఖమ్మం అర్బన్: భద్రాచలానికి చెందిన అలవాల నాగయ్యపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. కుటుంబ గొడవల కారణంగా ఈనెల 16న నాగయ్యపై కె.వంశీ దాడి చేశాడు. గాయపడిన నాగయ్యను ఖమ్మంలో ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబీకులు ఖమ్మంలో ఫిర్యాదు చేశారు. దీంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి భద్రాచలం బదిలీ చేస్తున్నట్లు సీఐ భానుప్రకాష్ వెల్లడించారు.
మైనార్టీ గురుకులంలో
విద్యార్థుల మధ్య ఘర్షణ
కొణిజర్ల: వుండలంలోని అమ్మపాలెం పంచాయతీ పరిధి తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, రెండో సంవత్సరం విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించగా వారు కొట్టారని తెలిసింది. దీంతో మొదటి సంవత్సరం విద్యార్థులు మంగళవా రం ఉదయం కళాశాల ప్రాంగణం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ జితేష్ సాహిల్ చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అలాగే, దెబ్బలు తిన్న బాలుడి తండ్రి, బంధువులు కూడా వచ్చి సీనియర్లపై ఫిర్యాదు చేయడంతో ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు.


