●మూడు తరాల నేతలు | - | Sakshi
Sakshi News home page

●మూడు తరాల నేతలు

Feb 5 2026 7:22 AM | Updated on Feb 5 2026 7:22 AM

●మూడు తరాల నేతలు

●మూడు తరాల నేతలు

వైరా: వైరానియోజకవర్గ రాజకీయాల్లో బొర్రా కుటుంబం దశాబ్ద కాలంగా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 1987లో నిర్వహించిన మండల ప్రజా పరిషత్‌ తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొర్రా భద్రయ్య ఎంపీపీగా ఎన్నికై 1993 వరకు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత భద్రయ్య కోడలు బొర్రా పద్మావతి 1995లో సోమవరం(వైరా) మేజర్‌ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందింది. 2001 వరకు ఆమె సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 2006 గ్రామపంచాయతీ ఎన్నికల్లో భద్రయ్య కుమారుడు బొర్రా వెంకటేశ్వర్లు పోటీ చేసి విజయం సాధించి 2011 వరకు సర్పంచ్‌గా కొనసాగారు. ఇక 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో బొర్రా వెంకటేశ్వర్లు కోడలు ఉమాదేవి వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి విజయం సాధించారు. ఇలా ఆ కుటుంబం మూడు తరాలుగా రాజకీయాల్లో కొనసాగుతోంది. అంతేకాక ఉమాదేవి ప్రస్తుతం వైరా మున్సిపాలిటీ మూడోవార్డు నుంచి పోటీ చేస్తూ చైర్మన్‌ రేసులో ఉన్నారు. ఇక వెంకటేశ్వర్లు కుమారుడు బొర్రా రాజశేఖర్‌ 2019లో వైరా పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌గా రెండేళ్ల పాటు పనిచేశారు.

‘బొర్రా’ కుటుంబంలో

ఎంపీపీ, సర్పంచ్‌లు, జెడ్పీటీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement