పకడ్బందీగా పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పరీక్షలు

Feb 2 2026 7:21 AM | Updated on Feb 2 2026 7:21 AM

పకడ్బ

పకడ్బందీగా పరీక్షలు

పరీక్షలకు 35 వేలమంది విద్యార్థులు

ఫలితాల పెంపుపై ప్రత్యేక దృష్టి

సందేహాల నివృత్తికి ప్రత్యేక తరగతులు

ఈసారి ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రభుత్వ కళాశాలల్లోనే..

జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కె.రవిబాబు

సన్నద్ధత ఇలా..

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈనెలలో జరగనుండగా, విద్యా సంవత్సరానికి సంబంధించి అక్టోబర్‌, నవంబర్‌ నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. తద్వారా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడం సులువవుతోంది. గత ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో 71.15 శాతం ఫలితాలు సాధించగా.. ద్వితీయ సంవత్సరం 77.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడనున్నాయి.

తల్లిదండ్రులతో సమావేశాలు

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడమే కాక అవసరమైన పుస్తకాలు అందిస్తోంది. అంతేకాక విద్యార్థులకు అందుతున్న బోధన, వారి మార్కులను తల్లిదండ్రులకు తెలియజేసేలా పేరెంట్‌ కమ్‌ టీచర్స్‌ సమావేశాలు నిర్వహించాం. విద్యార్థుల లోటుపాట్లను తెలియజేయడంతోపాటు వారిని ప్రోత్సహించేలా తల్లిదండ్రులకు అధ్యాపకులు సూచనలు చేస్తున్నారు. ఇది కూడా ఫలితాల మెరుగపడడానికి దోహదపడనుంది.

ప్రాక్టికల్స్‌కు నిధులు

జిల్లాలోని ఒక్కో ప్రభుత్వ కళాశాలలో సైన్స్‌ల్యాబ్‌కు అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ.50 వేలు కేటాయించింది. తద్వారా ఎలాంటి ఇక్కట్లు లేకుండా ప్రాక్టీస్‌ చేయడం, పరీక్షలు రాయడం సులువు కానుంది. వార్షిక పరీక్షలకు సంబంధించి కూడా వివిధ శాఖల అదికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాం.

వాట్సాప్‌కు హాల్‌టికెట్లు..

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్‌బోర్డు ఈ ఏడాది విద్యార్థుల సెల్‌కు మెసేజ్‌ పంపిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది.

సీసీ కెమెరాల నిఘా

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌, థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రాక్టికల్‌ పరీక్షలకు ఒక్కో ల్యాబ్‌లో ఒక్కో కెమెరా ఉంటుంది. థియరీ పరీక్షల సమయాన ప్రశ్నపత్రం బండిల్‌ తెరిచే గదిలోనే కాక ప్రధాన ప్రాంతాల్లో కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలన్నీ ఇంటర్మీడియట్‌ బోర్డుకు అనుసంధానమై ఉంటాయి. తద్వారా ఏమైనా సమస్యలు తలెత్తితే నేరుగా ఉన్నతాధికారులే జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చి పరిష్కరిస్తారు.

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

నేలకొండపల్లి: ఇంటర్‌ మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 67 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా ఇందులో జనరల్‌ కేంద్రాలు 57, ఒకేషనల్‌ కేంద్రాలు పది ఉన్నాయి. కాగా, మొత్తం 17,047 విద్యార్థుల్లో 13,007మంది(ఎంపీసీ 10,265 మంది, బైపీసీ 2,742 మంది)తో పాటు ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,858 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

జిల్లాలో 132 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, ప్రైవేట్‌ కళాశాలలకు సంబంధించి ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తంగా 35,188 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17,467 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 17,721 మంది ఉన్నారు. వీరి కోసం 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశాం. అదేవిధంగా ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వచ్చేనెల 2 నుంచి 21 వరకు రెండు సెషన్లలో జరగన్నాయి. మొత్తంగా 13,007 మంది విద్యార్థులు ఉండగా.. ఇందులో 10,265 మంది ఎంపీసీ, 2,742 మంది బైపీసీ విద్యార్థులు ఉన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు గాను 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం.

ఖమ్మంసహకారనగర్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి కె.రవిబాబు వెల్లడించారు.

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్‌ పరీక్షలు ఈనెల 2(సోమవారం)

నుంచి 11 వరకు, థియరీ పరీక్షలు 25నుంచి మార్చి 13వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌, థియరీ పరీక్షల నిర్వహణ, కేంద్రాల్లో ఏర్పాట్లు, విద్యార్థుల సన్నద్ధత తదితర అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. డీఐఈఓ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...

పకడ్బందీగా పరీక్షలు1
1/1

పకడ్బందీగా పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement