ఫిజియోథెరపిస్ట్‌కు రూ. 30 లక్షలకు టోకరా..
ఖమ్మంక్రైం: షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు ఓ ఫిజియోఽథెరపిస్ట్‌కు రూ. 30 లక్షల మేర కుచ్చుటోపి పెట్టారు. ఈ ఘటనలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం ఒకరిని అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తి అధిక లాభాల ఆశ చూపడంతో జిల్లాకు చెందిన ఫిజియోథెరపిస్ట్ ఒకరు వాట్సాప్ ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టారు. చివరకు లాభాలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నగదు వైజాగ్‌కు చెందిన జగ్గారావు బ్యాంక్ అకౌంట్‌కు వెళ్లినట్లు గుర్తించి, అతడిన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్‌క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ నరేష్, ఎస్‌ఐలు రంజిత్, విజయకుమార్, సిబ్బంది శ్రీనివాస్‌రావు, భానుమూర్తిని సీపీ సునీల్‌దత్ అభినందించారు.
సైబర్ నేరగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు


