కేసీఆర్‌ విచారణ దుర్మార్గపు చర్య | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ విచారణ దుర్మార్గపు చర్య

Feb 2 2026 7:23 AM | Updated on Feb 2 2026 7:23 AM

కేసీఆ

కేసీఆర్‌ విచారణ దుర్మార్గపు చర్య

● రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ● జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన ● ఖమ్మంలో తోపులాట.. విరిగిన సీఐ చేయి

● రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ● జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన ● ఖమ్మంలో తోపులాట.. విరిగిన సీఐ చేయి

ఖమ్మంవైరారోడ్‌: మాజీ సీఎం కేసీఆర్‌ను ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారించడం ప్రభుత్వ దుర్గారపు చర్య అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ విచారణను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన తెలపగా ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్‌లో చేపట్టిన ధర్నాలో పువ్వాడ, నాయకులు పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పెనుగులాట జరగగా ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ ఫోన్‌ టాపింగ్‌ అనేది పోలీసు అధికారులకే తప్ప సీఎం, మంత్రులకు సంబంధం ఉండదని తెలిసినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు, నాయకులు కర్నాటి కృష్ణ, నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల వలరాజు, జ్యోతిరెడ్డి, తోట రామారావు, బిక్కసాని జస్వంత్‌, బుడిగం శ్రీను, మాటేటి నాగేశ్వరరావు, పసుమర్తి రామ్మోహన్‌, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఖమర్‌, తాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఐ చేతికి ఫ్రాక్చర్‌, బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

ఖమ్మంక్రైం: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ను విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన తెలపగా... రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని నిలువరించేందుకు ఖమ్మం వన్‌టౌన్‌ సీఐ కరుణాకర్‌ సిబ్బంది ప్రయత్నించారు. ఈక్రమాన పోలీసులు – బీఆర్‌ఎస్‌ శ్రేణుల నడుమ తోపులాట జరగగా సీఐ కింద పడ్డారు. దీంతో ఆయన చేయి విరగగా ఆస్పత్రికి తరలించారు. కాగా, నగర ఏసీపీ రమణమూర్తి, అర్బన్‌ సీఐ భానుప్రకాష్‌ తదితరులు ఆస్పత్రికి వెళ్లి చికిత్సపై ఆరాతీశారు. కాగా, దిష్టిబొమ్మకు మంటలు ఆర్పే క్రమంలో టూటౌన్‌ సీఐ బాలకృష్ణ కూడా తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షడు పగడాల నాగరాజుతోపాటు కోయిలపోంగు వెంకట్‌, కోయలపోంగు ఉపేందర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే, నామవరపు ఈశ్వర్‌, మాటేటి కిరణ్‌, భూక్యా అశోక్‌పైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అరెస్ట్‌ అనంతరం బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును టూ టౌన్‌ స్టేషన్‌కు తరలించగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెళ్లి ఆయనతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం గర్హనీయమని, నిర్బంధాలు ఎదురైనా భయపడేది లేదని తెలిపారు.

కేసీఆర్‌ విచారణ దుర్మార్గపు చర్య1
1/1

కేసీఆర్‌ విచారణ దుర్మార్గపు చర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement