12 కేజీల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

12 కేజీల గంజాయి స్వాధీనం

Jan 30 2026 6:22 AM | Updated on Jan 30 2026 6:22 AM

12 కేజీల గంజాయి స్వాధీనం

12 కేజీల గంజాయి స్వాధీనం

వైరా: ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 12 కేజీల ఎండు గంజాయిని వైరా ఎకై ్సజ్‌ పోలీసులు గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌హెచ్‌ఓ మమతారెడ్డి తెలిపిన వివరాలు... ఎకై ్సజ్‌ ఉద్యోగులు వైరా బస్టాండ్‌లో తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారించగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం విదీషాకు చెందిన బ్రజేన్‌ అహిర్వార్‌గా తేలడంతో పాటు ఆయన బ్యాగ్‌లో 12.20 కేజీల గంజాయి లభించింది. ఈ గంజాయిని ఖమ్మం మీదుగా మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్తున్నట్లు అంగీకరించడంతో బ్రజేన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. తనిఖీల్లో ఎస్‌ఐలు రతన్‌ప్రసాద్‌రెడ్డి, కె.విజయ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement