గ్రామ సంఘాల పటిష్టతే లక్ష్యం
తల్లాడ: గ్రామసంఘాల పటిష్టతే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.ఆంజనేయులు సూచించారు. తల్లాడ మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం గ్రామ సమాఖ్యల ప్రతినిధులకు శిక్షణ ఏర్పాటుచేయగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలకు పటిష్టమైన నాయకత్వం ఉండేలా చూడడమే కాక ప్రతీనెలా సమావేశాల నిర్వహణ, రికార్డుల్లో నమోదు, ఆర్థిక అక్షరాస్యత, జీవనోపాధుల మెరుగుదలపై అవగాహన కల్పించాలని సూచించారు. భవిష్యత్‌లో గ్రామ సమాఖ్యల ద్వారా వ్యాపార నిర్వహణకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎం రవికుమార్, సీఆర్‌పీలు నజీమా బేగం, మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఐ.స్వప్న, ఉపారాణితో పాటు త్రివేణి, స్వాతి, భారతి, సీత, భద్రమ్మ, నిర్మల, అస్మత్, సాయమ్మ, సోంబాబు పాల్గొన్నారు.


