ఎన్నికల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ ఆరా
కల్లూరు రూరల్: కల్లూరు మున్సిపాలిటీలో ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ గురువారం పరిశీలించారు. ఈమేరకు ఏర్పాట్లపై ఆరా తీసిన ఆమె ఉద్యోగులకు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్‌లో బ్యాలెట్ బాక్స్‌ల భద్రత, కౌంటింగ్ హాల్‌లో అవసరమైన సదుపాయాల కల్పనపై చర్చించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.రామదుర్గారెడ్డి, ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ చలపతి, తహసీల్దార్ పులి సాంబశివుడు, మేనేజర్ ఎన్.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మత్స్య రైతులు
ఆర్థికంగా ఎదగాలి
కూసుమంచి: చేపల పెంపకంలో ఆధునిక విధానాలు పాటిస్తూ మత్స్య రైతులు ఆర్థికంగా ఎదగాలని నాబార్డ్ జిల్లా మేనేజర్ ఎల్.సుజిత్‌కుమార్ సూచించారు. పాలేరులోని పీవీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘బయో ప్లాక్ విధానంలో చేపల సాగు’ అంశంపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సుజిత్‌కుమార్ మాట్లాడుతూ మత్స్య రంగానికి ప్రభుత్వాలు ఇస్తున్న తోడ్పాటు, పాలేరు కేంద్రంలో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం నాబార్డు ద్వారా మత్స్యకారులు, రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ శిక్షణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల మత్స్య రైతులు పాల్గొనగా వారికి నైపుణ్య సర్టిఫికెట్లను అందజేశారు. పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు రవీందర్, శాంతన్న, దివ్య తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ ఆరా


