చకచకా పన్నుల వసూళ్లు
వైరా/సత్తుపల్లిటౌన్/కల్లూరు రూరల్: మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని పేరుకుపోయిన ఆస్తి, నల్లా పన్ను బకాయిలు వసూలతున్నాయి. పోటీ చేసే అభ్యర్థితో పాటు బలపరిచే వారి ఆస్తి, నీటి పన్నులు బకాయి ఉండొద్దనే నిబంధన విదించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు పన్నులన్నీ చెల్లించి నామినేషన్‌తో పాటు నో డ్యూ సర్టిఫికెట్ సమరించాల్సి ఉంటుంది. దీంతో సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, కల్లూరు, మధిర మున్సిపాలిటీల వద్ద బుధవారం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బిల్‌కలెక్టర్లతో పాటు వార్డు ఆఫీసర్లకు విధులు కేటాయించారు. ఈమేరకు సత్తుపల్లి మున్సిపాలిటీకి సాధారణంగా రోజుకు రూ.60వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం పన్నుల రూపంలో వస్తుంది. కానీ బుధవారం రూ.2.84 లక్షల ఇంటి, నీటి పన్నులు వసూలు కావడం విశేషం. ఇక వైరా మున్సిపాలిటీకి పన్నుల రూపేణా రూ.75,938 ఆదాయం నమోదైంది. అలాగే, కల్లూరు, మధిర, ఏదులాపురంలోనూ పలువురు పన్నులు చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకున్నారు.
ఎన్నికల్లో పోటీ కోసం చెల్లిస్తున్న ఆశావహులు


