చైనా వ్యాపారుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

చైనా వ్యాపారుల పర్యటన

Feb 3 2026 7:19 AM | Updated on Feb 3 2026 7:19 AM

చైనా వ్యాపారుల పర్యటన

చైనా వ్యాపారుల పర్యటన

రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో చైనా మిర్చి వ్యాపారుల బృందం సోమవారం పర్యటించింది. కోయచలక తదితర గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మిర్చి మిర్చి తోటలతో పాటు ఇప్పటికే కోసి ఆరబెట్టిన మిర్చిని ముగ్గురు సభ్యులతో కూడిన బృందం పరిశీలించి వివరాలు ఆరా తీశారు. విత్తన ఎంపిక, సాగు విధానం, చేతికి వచ్చే వరకు తీసుకున్న జాగ్రత్తలు, రసాయనాల వాడ కం, దిగుబడులను తెలుసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో చైనాకు చెందిన వ్యాపారులు మిర్చి ఫ్యాక్టరీ ఏర్పాటుచేయగా, ఇక్కడి వ్యాపారులు చైనాకు మిర్చి ఎగుమతి చేస్తున్నారు. ఈనేపథ్యాన ఆ దేశ వ్యాపారులు పర్యటించడంతో ఆసక్తి నెలకొంది.

షార్ట్‌ సర్క్యూట్‌తో

గృహోపకరణాలు దగ్ధం

కల్లూరురూరల్‌: కల్లూరులోని ఏకలవ్యనగర్‌లో సోమవారం బొడ్డు రవి ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడింది. దీంతో ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్‌ కాలిపోవడమే కాక ఇతర సామగ్రి, దుస్తులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష మేర ఆస్తి నష్టం జరిగినందున ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ తమను ఆదుకోవాలని రవి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement