నిఘా, తనిఖీ బృందాలు..
ప్రతీ మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని కలెక్టర్ నియమిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు వీరిదే బాధ్యత.
– ఫ్లయింగ్ స్క్వాడ్‌లు డబ్బు, మద్యం పంపిణీ, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఈ బృందంలో ఒక మెజిస్ట్రేట్ స్థాయి అధికారి, ఒక పోలీస్ అధికారి, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. వీరు నిరంతరం గస్తీ తిరుగుతూ ఉంటారు.
– స్టాటిక్ సర్వైలెన్స్ బృందం మున్సిపాలిటీ పరిధిలోని సరిహద్దులు లేదా చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తారు. అక్రమ రవాణా కట్టడికి కృషి చేస్తారు. ప్రతీ మున్సిపాలిటీకి ఒక బృందం (పెద్ద మున్సిపాలిటీల్లో రెండు, రెండు కార్పొరేషన్‌లో అంత కంటే ఎక్కువ) ఉంటుంది.
వీడియో సర్వైలెన్స్ బృందం ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, అభ్యర్థుల ప్రచారాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. కోడ్ ఉల్లంఘనలు జరిగితే సాక్ష్యంగా
ఈ వీడియోలు ఉపయోగపడతాయి.
●వ్యయ పరిశీలకులు అభ్యర్థులు చేసే ఖర్చు పర్యవేక్షిస్తుంటారు. అభ్యర్థులు సమర్పించే లెక్కలను
వీడియోల ఆధారంగా పరిశీలిస్తారు.
నిఘా, తనిఖీ బృందాలు..
నిఘా, తనిఖీ బృందాలు..
నిఘా, తనిఖీ బృందాలు..


