ఎదురెదురుగా ఢీకొన్న కంటైనర్‌ – లారీ | - | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా ఢీకొన్న కంటైనర్‌ – లారీ

Feb 3 2026 7:19 AM | Updated on Feb 3 2026 7:19 AM

ఎదురెదురుగా ఢీకొన్న కంటైనర్‌ – లారీ

ఎదురెదురుగా ఢీకొన్న కంటైనర్‌ – లారీ

వైరారూరల్‌: మండలంలోని స్టేజీ పినపాక హైలెవల్‌ వంతెన సమీపాన సోమవారం రాత్రి రాళ్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రధాన రహదారిపై ఇవి ఢీకొనడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాళ్ల లోడుతో వైరా వైపు నుంచి రాజమండ్రి వెళ్తున్న కంటైనర్‌, తల్లాడ వైపు నుంచి వస్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో సీఐ వెంకటప్రసాద్‌, ఎస్సై పి.రామారావు చేరుకుని బస్సులు మినహా భారీ వాహనాలను ఏన్కూరు మీదుగా పల్లిపాడు నుంచి తల్లాడ వైపు మళ్లించారు. ఆతర్వాత ప్రొక్లెయిన్‌ సాయంతో వాహనాలను తప్పించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంలో కంటైనర్‌, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జు కాగా డ్రైవర్లకు గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement