ఎన్నికల పరిశీలకుడిగా పవన్‌కుమార్
ఖమ్మంసహకారనగర్/సత్తుపల్లిటౌన్/కల్లూరు రూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యాన జిల్లా సాధారణ పరిశీలకులుగా పవన్‌కుమార్ నియమితులయ్యారు. టీజీఐఐసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత ఖమ్మంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశాక ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఆతర్వాత సత్తుపల్లి, కల్లూరులో నామినేషన్ల స్వీకరణను పవన్‌కుమార్ పరిశీలించారు. చివరిరోజైన శుక్రవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నందున సరిపడా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేసి అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ముజాహిద్, కల్లూరు మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు చలపతిరావు, సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ కమిషనర్లు కొండ్ర నర్సింహ, దుర్గారెడ్డి, మేనేజర్ ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


