మల్లారం పాఠశాల భేష్..
తల్లాడ/కల్లూరు రూరల్: ప్లాస్టిక్ రహిత పాఠశాలగా రూపుదిద్దుకుంటున్న తల్లాడ మండలం మల్లారం ప్రాథమిక పాఠశాల ఇతర స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యాశాఖ సీఎంఓ(క్లస్టర్ మానిటరింగ్ ఆఫీసర్) ప్రవీణ్‌కుమార్ అన్నారు. పాఠశాలలో గురువారం పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆతర్వాత నారాయణపురం పాఠశాలలో భవిత కేంద్ర భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అలాగే, కల్లూరు మండలం చెన్నూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను పరిశీలించిన సీఎంఓ... పదో తరగతి విద్యార్థులకు బోధన, పరీక్షలకు సన్నద్ధతపై చర్చించాక సచనలు చేశారు. ఎంఈఓ ఎన్.దామోదరప్రసాద్, హెచ్‌ఎంలు హెచ్‌ఎంలు జాబిశెట్టి ప్రసాదరావు, బి.హరిబాబు, కె.అనంతరాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


