మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలి

Jan 29 2026 6:13 AM | Updated on Jan 29 2026 6:13 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలి

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగురవేయడం ద్వారా పార్టీ సత్తా చాటేలా కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఐదు మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి పాటు పడాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కొండబాల కోటేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, వడ్డేబోయిన నరసింహారావు, పగడాల మంజుల, యర్రం బాలగంగాధర్‌ తిలక్‌, దొబ్బల సౌజన్య, సయ్యద్‌ గౌస్‌, బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement