అంతర్జాతీయ సదస్సుకు ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు
వైరా: దుబాయ్‌లో ఈనెల 7, 8వ తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆంగ్ల ఉపాధ్యాయుడు మొండ్రు భాస్కర్ ఎంపికయ్యారు. వైరాకు చెందిన ఆయన కొణిజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తుండగా, ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్’ పాల్గొని పరిశోధనా పత్రం సమర్పించన్నారు. ఏఐ ఆధారిత బోధనపై భాస్కర్ రూపొందించిన పరిశోధనా పత్రం సదస్సు అకడమిక్ కమిటీ ద్వారా ఆమోదం పొందింది. కాగా, సదస్సుకు తెలంగాణ నుంచి భాస్కర్ మాత్రమే ఎంపిక కాగా, పలువురు భినందించారు.
రూ.4.50లక్షల విలువైన భూమి వితరణ
కొణిజర్ల: మండలంలోని తుమ్మలపల్లిలో గ్రామ సమాఖ్య(సీ్త్ర శక్తి) భవన నిర్మాణం కోసం యర్రా నరసయ్య జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు 136 గజాల భూమి వితరణగా అందజేశారు. భవనం నిర్మాణానికి ప్రభుత్వ స్థఽలం లేక పోవడంతో శివాజీ గ్రామ సమాఖ్య బాధ్యులు సర్పంచ్ డేరంగుల వెంకటరమణను సంప్రదించారు. ఆమె నరసయ్య కుటుంబీలతో చర్చించగా యర్రా జానకమ్మ, ఆమె కుమారుడు కృష్ణయ్య రూ 4.50 లక్షల విలువైన భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను సోమవారం అందజేశారు. మాజీ సర్పంచ్ డేరంగుల బ్రహ్మం, గ్రామ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలి
ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్ర బడ్జెట్‌లో విస్మరించిన వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు పెంచాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. ఖమ్మం సుందరయ్య భవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం విత్తన, విద్యుత్ రంగాల్లో సంస్కరణల అమలు ద్వారా వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ సంస్థల ప్రవేశానికి అనువైన పరిస్థితి కల్పించారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకం నిధులు కేటాయింపులు తక్కువగా ఉన్నందున సరిచేయడంతో పాటు వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, మేరుగు సత్యనారాయణ, ఎర్రా శ్రీనివాసరావు, భూక్యా వీరభద్రం, వాసిరెడ్డి ప్రసాద్, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, వడ్లమూడి మధు, నందిపాటి మనోహర్, నాగేశ్వరరావు, వెంకన్న బాబు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ సదస్సుకు ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు


