సమగ్ర సవరణను పటిష్టంగా నిర్వహించాలి
ఖమ్మంసహకారనగర్ : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని, ఓటరు జాబితాలో ఓటర్ల మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పెండింగ్ ఫారం 6, 6ఏ, 7, 8లను త్వరగా పరిష్కరించాలన్నారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఎస్‌డీసీ రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎం.ఏ.రాజు, డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.


