●మార్కెట్లకు వందేళ్ల చరిత్ర | - | Sakshi
Sakshi News home page

●మార్కెట్లకు వందేళ్ల చరిత్ర

Feb 5 2026 7:22 AM | Updated on Feb 5 2026 7:22 AM

●మార్కెట్లకు వందేళ్ల చరిత్ర

●మార్కెట్లకు వందేళ్ల చరిత్ర

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మార్కెట్లకు వందేళ్ల చరిత్ర ఉంది. జిల్లా ప్రజలందరికీ సుపరిచితమైన సూపర్‌బజార్‌ సెంటర్‌ పక్కన చిన్నబజార్‌, పెద్దబజార్‌తో పాటుగా నేతాజీ మార్కె ట్లు ఉన్నాయి. ఈ మార్కెట్లు ప్రస్తుతం 52వ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. అయితే ఇల్లెందు, కొత్తగూడెంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైన సమయంలో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నిత్యావసరాలు, ఇతర సరుకుల సరఫరాకు మార్వాడీలు, ఆర్యవైశ్యులు, వారి కుటుంబాలతో సహా కొత్తగూడెం వచ్చి వ్యాపారాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తొలుత నేతాజీ మార్కెట్‌, ఆ తర్వాత చిన్నబజార్‌, పెద్దబజార్‌ ఏర్పడ్డాయి. కాలక్రమేనా కొత్తగూడెంలో కొంత అభివృద్ధి మొదలైన తర్వాత సూపర్‌బజార్‌ సెంటర్‌ ఏర్పాటైంది. నేతాజీ మార్కెట్‌, చిన్నబజార్‌, పెద్దబజార్‌లకు సమీపంలో ఉన్న మేదరబస్తీ, ప్రగతినగర్‌ వందేళ్ల క్రితం అటవీ ప్రాంతాలుగా ఉండేవి. అయితే సింగరేణి బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాక కార్మికులు, ఉద్యోగులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement