భక్తి ప్రపత్తులతో నదీ హారతి | - | Sakshi
Sakshi News home page

భక్తి ప్రపత్తులతో నదీ హారతి

Feb 2 2026 7:23 AM | Updated on Feb 2 2026 7:23 AM

భక్తి ప్రపత్తులతో నదీ హారతి

భక్తి ప్రపత్తులతో నదీ హారతి

భద్రాచలం: భద్రాచలంలో గోదావరి మాతకు ఆదివారం భక్తిప్రపత్తులతో నదీ హారతి నిర్వహించారు. మాఘ(వ్యాస పూర్ణిమ)ను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులతో ప్రత్యేక భజన, భక్తి గీతాల కార్యక్రమం చేపట్టారు. గణపతి పూజ, జైశ్రీరామ్‌ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన చేశారు. అనంతరం రామయ్యకు, గోదావరి నదికి హారతి సమర్పించారు. కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ – మనీషా దంపతులు, భద్రాచలం సర్పంచ్‌ పూనెం కృష్ణ, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆలయంలో నిత్యాన్నదానానికి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్‌ ఎన్‌.కవిత రూ.లక్ష విరాళం అందజేశారు. కాగా, గత జనవరిలో స్వామివారిని 2,92,369 మంది భక్తులు దర్శించుకోగా, గతేడాది జనవరిలో 2,72,335 మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement