ప్రచారం హోరెత్తేలా!
న్యూస్‌రీల్
హోరాహోరీగా...
మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారానికి వ్యూహాలు పోస్టర్లు, మైక్‌లు, ప్రదర్శనలతో ఓటర్లను కలిసేలా ప్రణాళిక అభ్యర్థుల ప్రచారంలో పాలు పంచుకోనున్న నేతలు
హామీలు నెరవేర్చే బాధ్యత నాదే..
శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నామినేషన్ల పర్వం ముగియడం, అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రావడంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల్లు దాఖలు చేసినప్పటి నుంచే కొందరు అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. షెడ్యూల్ రాకముందు, వచ్చాక డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వివిధ మున్సిపాలిటీల్లో పార్టీల నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
నామినేషన్లతోనే షురూ
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల నాయకులు గెలుపే లక్ష్యంగా ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొన్నివార్డుల్లో తొలి రోజే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ తదితర పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో వారు నామినేషన్ వేయగానే ప్రచారం మొదలుపెట్టారు. వార్డుల్లో ఇంటింటికీ వెళ్తూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే, ఫొటోలతో ప్రచార సామగ్రిని ముద్రించినా, గుర్తులు వస్తే వాటిని కూడా జోడించేందుకు సిద్ధమవుతున్నారు.
రంగంలోకి ప్రధాన నేతలు
పట్టణాల్లో పార్టీల ప్రతిష్టకు మున్సిపల్ ఎన్నికలు గీటురాయిగా నిలవనున్నాయి. ఈనేపథ్యాన ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో గెలుపును కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రచారంలో ప్రధాన నేతలు కూడా భాగస్వాములు కానున్నారు. ఎన్నికల దృష్ట్యా ఇటీవల ఏదులాపురం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ఎన్నికలపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. అలాగే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఖమ్మంలో పర్యటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారానికి హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. అలాగే బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రచారం చేయనున్నారు.
పది రోజులు..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11వ తేదీన జరగనుండగా, 9వ తేదీ సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశముంది. ఈ పది రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునేలా అభ్యర్థులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే, బీఆర్‌ఎస్ అభ్యర్థులు స్థానిక సమస్యలపై దృష్టి సారించారు. మరోపక్క బీఆర్‌ఎస్‌తో జత కట్టిన సీపీఎం కూడా ప్రచారంలో పాలు పంచుకుంటోంది. అంతేకాక బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అభ్యర్థులంతా ఇంటింటి ప్రచారంతో పాటు కూడళ్లల్లో సమావేశాలు నిర్వహిస్తుండడంతో మున్సిపాలిటీల్లో సందడి వాతావరణం నెలకొంది.
నిర్మాణ సంస్థ బాధ్యులతో
మంత్రి తుమ్మల సమీక్ష
మున్సిపాలిటీల్లో ఇప్పుడిప్పుడే మైక్‌ల మోత జోరందుకుంటోంది. రెండు, మూడురోజులుగా ఇంటింటి ప్రచారంపైనే దృష్టి సారించిన అభ్యర్థులు ఇప్పుడు తమ పార్టీ ప్రత్యేకతలు, వ్యక్తిగత గుణగణాలతో రూపొందించిన పాటలతో మైక్‌ల ద్వారా ప్రచారాన్ని మొదలుపెట్టారు. అనుచరులతో కలిసి వార్డుల్లో పర్యటిస్తూ ఈసారి తమను గెలిపిస్తే చేయనున్న అభివృద్ధి పనులు, పరిష్కరించే సమస్యలపై హామీలు ఇస్తున్నారు. ఇదంతా కొన్నిచోట్లే జరుగుతుండగా, శనివారం నుంచి మరింత హోరెత్తనుంది.
ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల కార్యాచరణ
ప్రచారం హోరెత్తేలా!
ప్రచారం హోరెత్తేలా!
ప్రచారం హోరెత్తేలా!


