రామయ్యకు కాసుల పంట
భద్రాచలం : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి హుండీల రూపంలో కాసుల పంట పండింది. డిసెంబర్, జనవరిలో సెలవులు రావడం, ముక్కోటి ఏకాదశి తోడు కావడంతో భక్తులతో ఆలయం కళకళలాడింది. వారు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా 70 రోజులకు గాను రూ.2,31,31,984 ఆదాయం నమోదైంది. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఈఓ దామోదర్‌రావు సమక్షంలో కానుకలను లెక్కించారు. ఈమేరకు నగదుతో పాటు 56 గ్రాముల బంగారం, 1,400 గ్రాముల వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీ కూడా లభించిందని ఈఓ వెల్లడించారు.
70 రోజులకు రూ.2.30 కోట్ల రాబడి


