మోగిన భేరి
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలు పోలింగ్‌స్టేషన్లు, బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం, ఉద్యోగులకు శిక్షణ పూర్తి
వార్డులు మొత్తం ఓటర్లు నామినేషన్ల స్వీకరణ
కేంద్రాలు
ఈనెల 28 నుంచి 30 వరకు
నామినేషన్ల స్వీకరణ (ఉదయం 10–30నుంచి సాయంత్రం 5గంటల వరకు)
నామినేషన్ల స్క్రూటినీ ఈనెల 31వ తేదీ
అభ్యంతరాల స్వీకరణ వచ్చేనెల 1న సాయంత్రం 5గంటల వరకు
అభ్యంతరాల పరిష్కారం వచ్చేనెల 2వ తేదీ
నామినేషన్ల ఉపసంహరణ గడువు వచ్చేనెల 3న సాయంత్రం 3గంటల వరకు
బరిలో ఉన్న అభ్యర్థుల ప్రకటన వచ్చేనెల 3న సాయంత్రం 3గంటల తర్వాత
పోలింగ్ వచ్చేనెల 11న ఉదయం 7గంటల నుంచి
ఓట్ల లెక్కింపు వచ్చేనెల 13వ తేదీ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల తుదిజాబితా విడుదల చేయగా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఉద్యోగుల నియామకం, శిక్షణతో పాటు సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందుగానే యంత్రాంగం ఏర్పాట్లు చేయడంతో ఇప్పుడు ఎన్నికలు సజావుగా నిర్వహించడంపై దృష్టి సారించారు.
చకచకా ఏర్పాట్లు
ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ల జాబితాలు ఇప్పటికే సిద్ధం కాగా, 242 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఈ వివరాలన్నీ మున్సిపల్ ఎన్నికల లాగిన్‌లో నమోదు చేశారు. ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లే కాక అదనంగా 20 శాతం కలిపి 580బాక్స్‌లు సమకూర్చుకుంటున్నారు. అలాగే, నామినేషన్ల స్వీకరణకు మున్సిపాలిటీల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను ఎంపిక చేయగా, వార్డుల వారీగా మొత్తం 43సెంటర్లు ఏర్పాటుచేశారు.
ఉద్యోగులు సిద్ధం
పోలింగ్ నిర్వహణకు 20 శాతం రిజర్వ్‌తో కలిపి పీఓలు 291 మంది, ఓపీఓలు 948 మంది అవసరమవుతారు. అలాగే, అదనపు సిబ్బందితో కలిపి రిటర్నింగ్ ఆఫీసర్లు 55 మంది, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 55 మందిని గుర్తించారు. ఇక 26 మంది జోనల్ అధికారులు, పది మందితో ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పాటు పది స్టాటిస్టిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్‌ఓలు, పీఓలు, ఓపీఓలకు శిక్షణ పూర్తయింది. పరీక్షల దష్ట్యా ఇంటర్మీడియట్ విద్యాశాఖ సిబ్బందిని, అత్యవసర సేవల్లో ఉన్న అంగన్‌వాడీ టీచర్లను మినహాయించారు.
కట్టుదిట్టంగా పోలింగ్
ఎన్నికల్లో అవాంఛనీయ ఘట నలు జరగకుండా సజావుగా నిర్వహించేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్, నామినేషన్ సెంటర్లలో వెబ్‌కాస్టింగ్ చేపడుతారు. అలాగే పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నారు. నామినేషన్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చేస్తారు.
మున్సిపల్ ఎన్నికలకు వేళాయె..
మోగిన భేరి
మోగిన భేరి
మోగిన భేరి


