అన్ని ఆస్పత్రుల్లో సరిపడా మందులు
నేలకొండపల్లి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు సరిపడా అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్‌ఓ డి.రామారావు వెల్లడించారు. మండలంలోని చెరువుమాధారం పీహెచ్‌సీని మంగళవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించాక షెడ్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో దగ్గుతో బాధపడుతున్న వారు ఆస్పత్రులకు వస్తుండగా, చలి తీవ్రత తగ్గాక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. కాగా, చెరువుమాధారం పీహెచ్‌సీని ఏర్పాటుచేశాక ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. వైద్యులు ఆర్.శ్రావణ్‌కుమార్, సన, నాగమణి, ఉద్యోగులు పాల్గొన్నారు.
పోలంపల్లి వాసికి
‘బెస్ట్ సోల్జర్’ అవార్డు
కారేపల్లి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కారేపల్లి మండలం పోలంపల్లికి చెందిన బానోతు దశరథ్‌కు బెస్ట్ సోల్జర్ అవార్డు లభించింది. గత 17ఏళ్లుగా భారత సైన్యంలో పనిచేస్తున్న ఆయన పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద శక్తులపై జరిగిన కీలక ఆపరేషన్లలో పాల్గొన్నాడు. ప్రస్తుతం చైనా సరిహద్దుల్లోని సియాచిన్ ప్రాంతంలో దశరథ్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తల్లిదండ్రులు, భార్య జమున, కుమారులు సోహాన్ వీర్, శ్రీనిధి పోలంపల్లిలో ఉంటున్నారు. దశరథ్ విధినిర్వహణలో చూపిన ప్రతిభకు గాను ఆర్మీ ఉన్నతాధికారులు బెస్ట్ సోల్జర్ అవార్డు అందించగా పలువురు వ్యక్తం చేశారు.
వైరా ఏసీపీగా సారంగపాణి
● ఇల్లెందు డీఎస్పీగా పోస్టింగ్ రద్దు
వైరా: వైరా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా సాదుల సారంగపాణిని నియమిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత ఏడాది అక్టోబర్ వరకు ఇక్కడ ఏసీపీగా విధులు నిర్వర్తించిన ఎం.ఏ.రహమాన్ రిటైర్ అయ్యారు. అంతకంటే ముందే జీహెచ్‌ఎంసీ పరిఽధిలో పనిచేస్తున్న పి.శ్రీనివాస్ ఏసీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినా ఆయన బాధ్యతలు స్వీకరించకముందే రద్దయ్యాయి. ఆపై పలువురు పోస్టింగ్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోగా, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్‌ను గత ఏడాది నవంబర్ 24న ఇన్‌చార్జ్ గా నియమించారు. ఇక ఈనెల 25న ఇల్లెందు డీఎస్పీగా సారంగపాణిని నియమించారు. మళ్లీ ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ ఆయన పోస్టింగ్ రద్దు చేస్తూ వైరా ఏసీపీగా నియమించడం గమనార్హం. రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
అన్ని ఆస్పత్రుల్లో సరిపడా మందులు
అన్ని ఆస్పత్రుల్లో సరిపడా మందులు


