పేరు లేదు.. ఊరు లేదు!
బడ్జెట్‌పై ఎవరేం అన్నారంటే..
దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో బాలికల హాస్టళ్లను అన్ని హంగులతో నిర్మించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు హాస్టళ్లు ఏర్పాటుకానున్నాయి. అలాగే, ఎరువుల తయారీ శాతాన్ని పెంచడంతో జిల్లా రైతులకు లబ్ధి జరగనుంది.
కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ఏళ్ల నాటి కలగా కొనసాగుతోంది. కొత్తగూడెంలో ఓ స్థలాన్ని ఎంపిక చేయగా, నేషనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించి ఇక్కడ ఏర్పాటు అసాధ్యమని తేల్చారు. ఫలితంగా జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ స్థలాలను సైతం గుర్తించింది. కానీ కేంద్ర బడ్జెట్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ప్రస్తావన లేకపోవడంతో అడుగు ముందుకు పడడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సెల్‌ఫోన్ చిప్‌ల తయారీలో కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతకు కేంద్రం బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రత్యేక కారిడార్‌ను ప్రకటించగా అందులో ఒడిశా – ఏపీ – తమిళనాడు – కర్ణాటకలకు స్థానం దక్కింది. కానీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతలో కీలకంగా నిలిచే సింగరేణి గనులు ఉన్న తెలంగాణకు మాత్రం చోటివ్వలేదు. ఇదే లక్ష్యంతో కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఫలితం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
పేరు లేదు.. ఊరు లేదు!
పేరు లేదు.. ఊరు లేదు!
పేరు లేదు.. ఊరు లేదు!


