బోధనలో సాంకేతికత జోడించండి
● డీఈఓ చైతన్య జైనీ ● పీఎంశ్రీ స్కూళ్ల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు శిక్షణ
కరోనా అనంతరం సాంకేతిక వినియోగం పెరిగింది. దీంతో అధికారులు పంపించే గూగుల్ షీట్లు, డాక్యుమెంట్లలో వివరాలు నింపుతున్నా వాటి తయారీపై అవగాహన లేదు. దీంతో బోధన మెరుగుపడేలా శిక్షణ ఇచ్చారు. – సరస్వతి,
జెడ్పీహెచ్‌ఎస్, కూసుమంచి
హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు ఇంటరాక్టివ్ కంటెంట్ల తయారీపై అవగాహనకు శిక్షణ ఇస్తున్నాం. ఇది పాఠ్యాంశాల బోధనలో ఉపయోగపడుతుంది. అలాగే, విద్యార్థులు సొంతంగా అర్థం చేసుకునేలా తర్ఫీదు ఇవ్వడం వీలవుతుంది.
– దొడ్డపనేని కృష్ణారావు, రిసోర్స్ పర్సన్
పీఎంశ్రీ పాఠశాలల్లో సాంకేతికత వినియోగం పెరి గింది. ప్రతీ పాఠశాలకు లాప్‌టాప్, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందించాం. వీటి ఉపయోగం, సాంకేతికతపై అవగాహన తద్వారా విద్యార్థులకు నా ణ్యమైన బోధన కోసం అవగాహన కల్పిస్తున్నాం.
– పెసర ప్రభాకర్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్
ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయులు బోధనలో పాఠ్యాంశాలకు తోడు సాంకేతిక జోడించాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు. తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు 508మందికి ఐసీటీ అంశంపై రెండు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ తరగతులు బుధవారం జిల్లా విద్యా శిక్షణ సంస్థ, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న డీఈఓ చైతన్యజైనీ మాట్లాడుతూ అసెస్‌మెంట్, కమ్యూనికేషన్ తదితర అంశాల్లో బోధన మరింత మెరుగుపడాలని తెలిపారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే కాక మెరుగైన అభ్యసన ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. శిక్షణలో భాగంగా గూగుల్ షీట్లు, డాక్యుమెంట్ల రూపకల్పన, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
బోధనలో సాంకేతికత జోడించండి
బోధనలో సాంకేతికత జోడించండి


