● ‘ఉపాధి’కి పెంపు
వ్యవసాయ పనులు లేనప్పుడు కూలీలకు అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్‌లో నిధులు పెంచారు. ఖమ్మం జిల్లాలో 3.05లక్షల జాబ్ కార్డులు, 6.29లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో యాక్టివ్ జాబ్ కార్డులు 1.75 లక్షలకు గాను 2.88 లక్షల మంది యాక్టివ్ కూలీలు కొనసాగుతున్నారు. భద్రాద్రి జిల్లాలో 2.23 లక్షల జాబ్ కార్డులు, 4.58 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో యాక్టివ్ జాబ్ కార్డులు 1.35 లక్షలు ఉండగా, 2.29 లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. పథకానికి బడ్జెట్‌లో నిధులు పెంచినట్లు తెలుస్తున్నా స్పష్టత రావాల్సి ఉంది.


