● పోస్టల్‌ బ్యాలెట్‌కు రేపటి వరకు గడువు | - | Sakshi
Sakshi News home page

● పోస్టల్‌ బ్యాలెట్‌కు రేపటి వరకు గడువు

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

● పోస

● పోస్టల్‌ బ్యాలెట్‌కు రేపటి వరకు గడువు

సత్తుపల్లిటౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్‌ బ్యాలెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం తొలుత దరఖాస్తు ఫారం–12కు ధ్రువీకరణ పత్రం జత చేసి ఓటుహక్కు కలిగి ఉన్న మున్సిపాలిటీలో శనివారంలోగా అందజేయాలి. ఆపై రిటర్నింగ్‌ అధికారి ఫారం–15, 16, 7, 18ను అందిస్తారు. వీటిలో ఓటు నమోదు చేసి ఆదివారం 8వ తేదీ ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది.

ఓటు హక్కు కేంద్రాలు

ఏదులాపురం మున్సిపాలిటీ సంబంధించి ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ఖమ్మం రూరల్‌ ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్‌హాల్‌లో ఏర్పాటుచేసిన డ్రాప్‌ బాక్స్‌లో వేయాలి. అలాగే, మధిర మున్సిపాల్టీకి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో, కల్లూరు మున్సిపాలిటీ పరిధి ఉద్యోగులు కల్లూరు జీహెచ్‌ఎస్‌లో, వైరా ఉద్యోగులు తహసీల్‌లో, సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి ఉద్యోగులు మున్సిపల్‌ కార్యాలయంలోని సెంటర్‌లో ఓటు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.

పోల్‌ స్లిప్పులు రెడీ

వైరా: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 11న జరగనుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లలో వేగం పెంచారు. ఇందులో భాగంగా వైరా మున్సిపాలిటీ 20 వార్డుల్లో 24,689మంది ఓటర్లు ఉండగా వీరికి పంపిణీ చేసేందుకు పోల్‌ స్లిప్పులను సిద్ధం చేశారు. మున్సిపల్‌ సిబ్బంది వీటిని ఇంటింటికీ పంపిణీ చేయనున్నారని కమిషనర్‌ యు.గురులింగం తెలిపారు.

● పోస్టల్‌ బ్యాలెట్‌కు      రేపటి వరకు గడువు
1
1/1

● పోస్టల్‌ బ్యాలెట్‌కు రేపటి వరకు గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement