●62ఏళ్ల పాలనకు సాక్ష్యం | - | Sakshi
Sakshi News home page

●62ఏళ్ల పాలనకు సాక్ష్యం

Jan 31 2026 7:15 AM | Updated on Jan 31 2026 7:15 AM

●62ఏళ్ల పాలనకు సాక్ష్యం

●62ఏళ్ల పాలనకు సాక్ష్యం

కల్లూరులో అరవై ఏళ్ల స్థానిక పాలనకు ప్రస్తుత మున్సిపల్‌ కార్యాలయ భవనం సాక్ష్యంగా నిలుస్తోంది. దేశంలో

పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పడిన రెండేళ్లకు 1962లో కల్లూరులో గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణం మొదలుపెట్టారు. ఈ భవనాన్ని 1964లో అప్పటి జెడ్పీ చైర్మన్‌ జలగం వెంగళరావు ప్రారంభించారు. మొదట ఏడు వార్డులతో మొదలైన పంచాయతీ 18వార్డులకు

విస్తరించి 17వేల జనాభా, 12వేల ఓటర్లతో రాష్ట్రంలోనే పెద్ద పంచాయతీగా కొనసాగింది. ఇలా 62 ఏళ్ల నుంచి చిన్నపాటి మరమ్మతులు తప్ప భవనం పటిష్టంగా

ఉండడంతో మేజర్‌ గ్రామపంచాయతీ నుంచి

మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ ఇదే భవనంలో కార్యాలయం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కల్లూరు మున్సిపాలిటీ 20 వార్డుల్లో 18,886 ఓటర్లు ఉండగా తొలి పాలకవర్గం ఎన్నిక జరగనుంది. – కల్లూరురూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement