●నాడు భర్త.. నేడు భార్య | - | Sakshi
Sakshi News home page

●నాడు భర్త.. నేడు భార్య

Feb 7 2026 10:11 AM | Updated on Feb 7 2026 10:11 AM

●నాడు భర్త.. నేడు భార్య

●నాడు భర్త.. నేడు భార్య

వైరా: వైరా మున్సిపాలిటీలో తొలి వైస్‌ చైర్మన్‌గా గతంలో ముళ్లపాటి సీతారాములు పదవి చేపట్టగా ఇప్పుడు ఆయన భార్య ముళ్లపాటి విజయలక్ష్మి పోటీలో ఉన్నా రు. నాడు అధికార బీఆర్‌ఎస్‌ నుంచి సీతారాములు పోటీ చేయగా ఆయన ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఇప్పుడు ఆయన భార్య విజయలక్ష్మి 13వ వార్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

ప్రత్యర్థులుగా అన్నదమ్ములు

కొణిజర్ల: వైరా మున్సిపాలిటీ బరిలో అన్నదమ్ము లు ప్రత్యర్థులుగా మారారు. ఒకరు అధికార కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగగా, మరొకరు ప్రతిపక్ష బీఆర్‌ ఎస్‌ పోటీ చేస్తున్నారు. వైరా మున్సిపాలిటీ శివారు పల్లిపాడు 16వ వార్డులో రాచబంటి బలరామయ్య కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తుండగా అతని బా బాయి కుమారుడు రాచబంటి బాలకృష్ణ బీఆర్‌ఎస్‌ తరఫున పోటీలో ఉన్నాడు. మరో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement