టీ.టీ. టోర్నీలో 17పతకాలు | - | Sakshi
Sakshi News home page

టీ.టీ. టోర్నీలో 17పతకాలు

Feb 4 2026 7:09 AM | Updated on Feb 4 2026 7:09 AM

టీ.టీ

టీ.టీ. టోర్నీలో 17పతకాలు

ఖమ్మం స్పోర్ట్స్‌: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 1, 2వ తేదీల్లో జరిగిన ఖేల్‌ క్షేత్ర ఆల్‌ ఇండియా ఇంటర్‌ స్కూల్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఖమ్మం నుంచి పాల్గొన్న క్రీడాకారులు 17 పతకాలు సాధించారు. జూనియర్‌, సీనియర్‌, సబ్‌ జూనియర్‌ కేటగిరిల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచి పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, క్రీడా సంఘాల బాధ్యులు బాలసాని విజయ్‌కుమార్‌, వీవీఎస్‌.మూర్తి, పుట్టా శంకరయ్య, కె.క్రిస్టోఫర్‌బాబు, కొండ శ్రీధర్‌, డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌, డాక్టర్‌ జంగాల సునీల్‌కుమార్‌, ప్రవీణ్‌, చలపతి, రెడ్డిసాయి, మజార్‌ అభినందించారు.

చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత

ఖమ్మంఅర్బన్‌: అధిక వర్షపాతం సమయాన వరద నీటిని నిల్వచేసి భూగర్భ జలాలను పెంపొందించడంలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తున్నందున పరిరక్షించుకోవాలని జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ సూచించారు. ఖమ్మం 14వ డివిజన్‌లో చిత్తడి నేలల పరిరక్షణ ప్రాధాన్యతపై విద్యార్థులు, ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించగా ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయన్నారు. అంతేకాక అరుదైన పక్షులు, జీవరాశుల కు ఆవాసంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు చెరువులను ప్లాస్టిక్‌ వ్యర్థాలు, రసాయనాలతో కలుషితం చేయకుండా కాపాడుకోవా లని సూచించారు. అటవీశాఖ డివిజన్‌ అధికారి మంజుల, ఉద్యోగులు పాల్గొనగా వెలుగుమట్ల జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.

మత్స్య రైతులకు శిక్షణ

కూసుమంచి: మండలంలోని పాలేరు పీవీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘బయో ప్లాక్‌ విధానంలో చేపల సాగు’ అంశంపై ఏర్పాటుచేసిన శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల మత్స్య రైతులు పాల్గొనగా సూర్యాపేట జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి బానోత్‌ నాగులునాయక్‌ మాట్లాడారు. మత్స్య సంపద పెంపునకు ఆధునిక విధానాలు అనుసరించాలని సూచించారు. పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్యాంప్రసాద్‌, శాస్త్రవేత్తలు రవీందర్‌, శాంతన్న, దివ్య పాల్గొన్నారు.

తాగునీటి సమస్య రావొద్దు

ముదిగొండ: రానున్న వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్లూఎస్‌ ఎస్‌ఈ శేషిరెడ్డి సూచించారు. తాగునీటి వసతులు, సమస్యలపై చేపడుతున్న సర్వేను ముదిగొండ మండలం గోకినేపల్లిలో మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాత వాటర్‌ ట్యాంక్‌ కొత్తది నిర్మాణం, బోరు, మోటారు, పైపులైన్‌ కోసం రూ.1.12కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈమేరకు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన ఎస్‌ఈ స్థానిక ఉద్యోగులకు సూచనలు చేశారు. మిగతా ప్రాంతాల్లో సమస్యలు ఉంటే మరమ్మతుకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసరావు, ఏఈలు విజయరాజు, సుధాకర్‌, సర్పంచ్‌ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

3,017 మె.టన్నుల యూరియా

చింతకాని: మూడు జిల్లాల రైతుల అవసరాల కోసం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్‌ టన్నుల యూరియా మంగళవారం చేరింది. చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు యూరియా వచ్చిందని ఏఓ(టెక్నికల్‌) పవన్‌కుమార్‌ తెలిపారు. ఇందులో 1,517.16మెట్రిక్‌ టన్నులను ఖమ్మం జిల్లాకు, 500 మె.టన్నులు భద్రాద్రి జిల్లాకు, 800 మె.టన్నులకు మహబూబాబాద్‌ జిల్లాకు సరఫరా చేయగా, మరో 200 మెట్రిక్‌ టన్నుల యూరియాను బఫర్‌ స్టాక్‌ నిల్వ చేసినట్లు వెల్లడించారు.

టీ.టీ. టోర్నీలో 17పతకాలు
1
1/3

టీ.టీ. టోర్నీలో 17పతకాలు

టీ.టీ. టోర్నీలో 17పతకాలు
2
2/3

టీ.టీ. టోర్నీలో 17పతకాలు

టీ.టీ. టోర్నీలో 17పతకాలు
3
3/3

టీ.టీ. టోర్నీలో 17పతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement