ప్రభుత్వ పాఠశాలకు రూ.93 వేల విలువైన బెంచీలు
తల్లాడ: మండలంలోని కలకొడిమ ప్రభుత్వ పాఠశాలకు కొత్తపల్లి చలపతిరావు ఆధ్వర్యాన నిస్వార్ధ ఫౌండేషన్ ద్వారా రూ.93వేల విలువైన 20 స్కూల్ డెస్క్ బెంచీలు అందజేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎన్.దామోదరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంత్, సర్పంచ్ తాతా సుమతీబాయితో పాటు తాతా భాస్కర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఖమ్మం సహకారనగర్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేలా ఉన్నత విద్యనభ్యసించేందుకు ఇగ్నో(ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్) యూనివర్సిటీ వేదికగా నిలుస్తుందని అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపా రు. ఖమ్మంలోని పలు కళాశాలల్లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఇగ్నోలో కోర్సులో చదువుతూనే విద్యార్థులు రెగ్యులర్ చదువు కొనసాగించే అవకాశముందని తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉన్నందున సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇగ్నో సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ కే.వీ.రమణారావు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఆర్.పాపారావు, వెంకటేష్ పాల్గొన్నారు.


