చివరి దశకు పత్తి కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

చివరి దశకు పత్తి కొనుగోళ్లు

Feb 7 2026 10:11 AM | Updated on Feb 7 2026 10:11 AM

చివరి దశకు పత్తి కొనుగోళ్లు

చివరి దశకు పత్తి కొనుగోళ్లు

● సీసీఐ కొన్నది 4.41 లక్షలు.. ప్రైవేట్‌గా 2.73 లక్షల క్వింటాళ్ల కొనుగోలు ● సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయాలకు ఫిబ్రవరి 20 వరకు అవకాశం

20వ తేదీ వరకు అవకాశం

● సీసీఐ కొన్నది 4.41 లక్షలు.. ప్రైవేట్‌గా 2.73 లక్షల క్వింటాళ్ల కొనుగోలు ● సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయాలకు ఫిబ్రవరి 20 వరకు అవకాశం

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో పత్తి విక్రయాలు చివరి దశకు చేరుకున్నాయి. వానాకాలం సీజన్‌లో మొత్తం 6 లక్షల ఎకరాల్లో పంటలుసాగు కాగా 3.03లక్షలఎక రా ల్లో వరి, రెండో స్థానంలో 2.56 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం 40వేల ఎకరాల వరకు పెరిగింది. మిర్చి కి ధర లేకపోవటంతో రైతులు పత్తివైపు మొగ్గు చూ పారు. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు పత్తి పంట దిగుబడులపై ప్రభావాన్ని చూపాయి. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడులు సగానికి పడిపోయాయి. పండిన పంటకు కనీస మద్దతు ధరలేకపోవటంతో ప్రభుత్వం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం తేమశాతం ఆధారంగా నిర్ణయించిన మద్దతు ధరతో కొనుగోళ్లు చేశా రు. తొలుత ప్రైవేట్‌ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.5 నుంచి రూ.6వేల వరకు ధర పలకగా, సీసీఐ కేంద్రా లు ఏర్పాటు చేసిన తరువాత వ్యాపారులు నాణ్యతా ప్రమాణాల ఆధారంగా రూ.7వేల వరకు కొనుగోలు చేశారు. కొద్దిరోజులుగా ఆ ధర రూ.7,800 వరకు పెరి గింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 8 శాతం తేమ ఉన్న పత్తికి రూ.8,110గా, 9 శాతానికి రూ.8,029గా, 10 శాతానికి రూ.7,948, 11 శాతానికి రూ.7,867గా, 12 శాతం తేమ కలిగిన పత్తికి రూ.7,786 చొప్పున ధర నిర్ణయించి కొనుగోలు చేసింది.

7.14 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు

జిల్లాలో ఈఏడాది ఇప్పటి వరకు మొత్తంగా 7,14, 953 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు చేపట్టింది. ప్రభుత్వం సీసీఐ ద్వారా 8 జిన్నింగ్‌ మిల్లుల్లో 21,281 మంది రైతులకు చెందిన 4,41,850 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఖమ్మం, మద్దులపల్లి, మధిర, వైరా వ్య వసాయ మార్కెట్ల పరిధిలో ఉన్న జిన్నింగ్‌ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లు చేశారు. కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా ఈ ఏడాది సీసీఐ పత్తి కొనుగోళ్లు నిర్వహించింది. సీసీఐ పత్తికొనుగోళ్లలో వ్యాపారులు తమ మాయాజాలాన్ని ప్రదర్శించి రైతుల నుంచి రూ.5 నుంచి రూ.6 వేల చొప్పున కొనుగోలు చేసి సీసీఐ కేంద్రాల్లో (జిన్నింగ్‌ మిల్లుల్లో) విక్రయించి క్వింటాలుకు రూ.2 వేలకు పైగా లాభాలు ఆర్జించారు. ఇక ప్రైవేట్‌ వ్యాపారులు ఖమ్మం, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లలో, గ్రామాల్లో 2,73,103 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. కొందరు వ్యాపారులు పత్తిని గుజరాత్‌ రాష్ట్రానికి ఎగుమతి చేశారు.

సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయాలకు ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం ఉంది. కపాస్‌ కిసాన్‌ యాప్‌లో పత్తి విక్రయాలకు నమోదు చేసుకున్న రైతులు కనీస మద్దతు ధరల ప్రయోజనాన్ని పొందేందుకు నిర్ణీత గడువులోగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పత్తిని విక్రయించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరింత సమాచారానికి 94405 87833లో సంప్రదించవచ్చు.

–ఎంఏ అలీం, జిల్లా మార్కెటింగ్‌ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement